Janasena: ప్రతిపక్షాల విషయంలో బాగా యాక్టివైన జనసైనికులు

Janasena: ఈమధ్య కాలంలో జనసేన నేతలు, కార్యకర్తలు కూడా బాగానే యాక్టివవుతున్నారు. ఒకపుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రతిపక్షాల నేతలు ఏమైనా అంటే పెద్దగా పట్టించుకునే వారుకాదు. ఎప్పుడైనా తన ప్రత్యర్ధులు తనపై చేసిన ఆరోపణలు, విమర్శలకు పవనే స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితుండేది. గడచిన మూడేళ్ళుగా జనసేన-బీజేపీ మిత్రపక్షాలుగానే ఉన్నప్పటికీ పవన్ కు వచ్చిన మద్దతు పెద్దగా కనబడటంలేదు.

Advertisement

 

Advertisement

పవన్ పై ఒకపుడు తెలుగుదేశంపార్టీ నేతలు, లేదా వైసీపీ నేతలు ఏవైనా ఆరోపణలు చేసినా విమర్శలు చేసినా బీజేపీ నేతలు స్పందించేవారు కాదు. ఎందుకంటే మిగిలిన పార్టీలెంతో జనసేన కూడా అంతేకాబట్టి. కానీ ఇపుడు బీజేపీ మిత్రపక్షమైనా కూడా కమలనాదులు అదే ధోరణిలో వెళుతున్నారు. ఇపుడు పవన్ పై టీడీపీ నేతలు ఏమీ మాట్లాడటంలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం బాగానే రెచ్చిపోతున్నారు.

మరలాంటపుడు మిత్రపక్షమైన బీజేపీ నేతలు పవన్ కు మద్దతుగా నిలబడాలి కదా. కానీ అన్నది పవన్ను కాబట్టి తమకెందుకులే అన్నట్లుగా చూస్తు ఊరుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే జనసేనలోని కొందరు నేతలు, కార్యకర్తలు మాత్రం బాగా యాక్టివ్ అయ్యారు. ప్రత్యేకించి పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. ఒకపుడు సినిమా అభిమానులు మాత్రం ఫేస్ బుక్ లో బాగా యాక్టివ్ గా ఉండేవారు.
తమ అభిమాన నటుడిని ఎవరైనా ఏమన్నా అంటే రెచ్చిపోయి తమ ప్రతాపం చూపించేవారు. అయితే దానివల్ల పవన్ కు చెడ్డపేరే తప్ప ఇంకేమీ ఉపయోగం కనబడేదికాదు. ఎందుకంటే పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి కాస్త హుందాగా ప్రత్యర్ధులకు ధీటైన కౌంటర్లు ఇచ్చేవారుండాలి. ఒకపుడు ఈలోటు జనసేనలో బాగా కనబడేది. అందుకనే దాదాపు ఆరుమాసాలుగా పార్టీ తరపున కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళని ఏర్పాటుచేసుకున్నారు.

దాంతో మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలకు ధీటుగా జనసేన నేతలు కూడా సమాధానాలు ఇస్తున్నారు. కొందరు మీడియా సమావేశాలు పెట్టి గట్టిగానే ఎదుర్కొంటున్న దాని రీచ్ తక్కువగానే ఉంటోంది. అందుకనే ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఫేస్ బుక్ లైవ్, వాట్సప్, యూట్యూబ్ ఛానళ్ళు ఏర్పాటు చేసుకుని రెచ్చిపోతున్నారు. దీంతో పవన్ కు మద్దతుగా సామాన్య జనాల్లోకి జనసేన నేతల వాదన కూడా వినిపిస్తోంది.

ఇదే సమయంలో జనాల సమస్యలపై జనసేన నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తుండటంతో జనాల్లో కొందరిచూపు మెల్లిగా జనసేనవైపుకు మళ్ళుతోంది. ఇలాగే మైన్ టెన్ చేస్తే ఎన్నికల నాటికి జనసేనకు కాస్త మైలేజీ వచ్చే అవకాశముంది. ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలనే పవన్ ఆలోచన మీద మిగిలిన విషయాలు ఆధారపడుంది. మొత్తానికి నేతలు, కార్యకర్తలు యాక్టివ్ అవటం పార్టీకి మంచిదే కదా.

Advertisement