Xiaomi Redmi 11 : అద్దిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో షియోమీ రెడ్మీ 11 5G స్మార్ట్ ఫోన్.. ధర ఎంతంటే..!!

Xiaomi Redmi 11 : ప్రస్తుతం ప్రతి ఒక్కరికి కూడా టెక్నాలజీ చాలా అవసరం పడుతూనే ఉన్నది. టెక్నాలజీ లేనిదే మనం రాబోయే కాలంలో ఉండలేము అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాలం మారేకొద్దీ అత్యధిక టెక్నాలజీ కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది టెక్నాలజీ కి అలవాటు అలాంటి వాటిలో స్మార్ట్ ఫోన్ ఒకటి అని చెప్పవచ్చు. అందుచేతనే ఇప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కూడా మనకి స్మార్ట్ మొబైల్ లోనే అన్నిటిని సర్చింగ్ చేస్తూ ఉంటాము. కేవలం సెర్చింగ్ మాత్రమే కాదు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మన మొబైల్ ద్వారా ని ఉపయోగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా సరి కొత్త అప్డేట్ లతో వస్తున్న మొబైల్ పైన ఎక్కువగా యువత ఆసక్తి చూపిస్తున్నారు.ఇప్పుడు భారతీయ మార్కెట్లో అతి తక్కువ ధరలకే లభిస్తున్న పలు బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ లో షియోమి బ్రాండ్ కలిగిన మొబైల్స్ కూడా ఒకటి. ఈ బ్రాండెడ్ కలిగిన మొబైల్స్ మార్కెట్ లో తమకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సాధించాయి.. ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్ తో మార్కెట్ లో తనకంటూ షియోమి ప్రత్యేకమైన స్థానాన్ని సాధించినది.

ఇక ఈ క్రమంలోనే తాజాగా షియోమి కి చెందిన రెడ్మి-11 5G మొబైల్ ఇండియాలో త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈసారి మాత్రం అదిరిపోయే ఫీచర్స్ ను అందించడమే ధ్యేయంగా ప్లాన్ చేస్తోంది ఈ సంస్థ. సరికొత్త ప్రాసెస్ కలిగిన ఈ కొత్త ఫోను ను విడుదల చేయనున్నట్లుగా మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ మొబైల్ ఈ ఏడాది జూన్ నెలలో భారత్లో విడుదల కానుంది. రెడ్ మి-10 మొబైల్ కి కొనసాగింపు గా రెడ్మి 11 5G ఉంటుంది. అతి తక్కువ బడ్జెట్ తో నే భారత్ మార్కెట్లోకి ఈ మొబైల్ ఎంట్రీ ఇవ్వనుంది.రెడ్మీ -11 5G మొబైల్ దేశీయ మార్కెట్లో ధర ప్రకారం గా రూ.13,999 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ వివరాల విషయానికి వస్తే.. ఈ రెడ్మీ మొబైల్..6.58 ఇంచుల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే తో మార్కెట్లోకి విడుదల కానుంది. ఇక అంతే కాకుండా 90 HZ ఎల్సిడి ప్యానెల్ తో ఈ స్మార్ట్ మొబైల్ విడుదల కానుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండనుంది. ఇక ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం..18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా ఈ మొబైల్ ఎంట్రీ ఇవ్వనుంది.

Xiaomi Redmi 11 5G smartphone on the market with features
Xiaomi Redmi 11 5G smartphone on the market with features

ఇక కెమెరాల విషయానికి వస్తే.. రెడ్ మి -11 5G డిఎల్ కెమెరా తో పాటుగా..5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ తాజా వేరియేషన్ అయిన ఆండ్రాయిడ్ -12 తో రన్ అవడం జరుగుతుంది. ఇక ఈ మొబైల్ 11 T-PRO-5G మొబైల్ ధర విషయానికి వస్తే రూ.37,999 రూపాయలకి లభిస్తోంది. ఇందులో ప్రాసెస్ స్నాప్ డ్రాగన్ 888 కలదు.120 HZ ఫుల్ హెచ్ డి డిస్ ప్లే తో పాటు+అమొలెడ్ డిస్ప్లే కూడా కలదు. ఇక కెమెరా విషయానికి వస్తే..108 MP +16 MP+5 ఎంపీ కెమెరా లు కలవు.5000 MAH బ్యాటరీ సామర్థ్యం కలదు.120 W చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో కలవు. ఈ మొబైల్ ని జనవరి 22 ఇండియాలో లాంచ్ చేసినది. దీని ధర రూ.40 వేల సెగ్మెంట్ తో కలదు. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ కి బాగా డిమాండ్ పెరిగిపోతోంది. ఇక షియోమీ అందిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లకు మంచి గిరాకీ ఉండడంతో పాటు ధర కూడా తక్కువ పలుకుతూ ఉండడం వినియోగదారులకు మరింత సులభతరం అయ్యింది అందుకే చాలా మంది కస్టమర్లు ఈ బ్రాండ్ మొబైల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.