Apple iOS 16 : యాపిల్ ఐఓఎస్ 16 వచ్చేసింది.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే..!!

Apple iOS 16 : ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగిస్తున్న స్మార్ట్ మొబైల్స్ లో యాపిల్ ఐఫోన్ కూడా ఒకటి. అయితే అత్యాధునిక టెక్నాలజీ లతో పరిచయమవుతున్న ఈ స్మార్ట్ ఫోన్లు ధర కూడా కొంచెం ఎక్కువ పలుకుతున్నాయి. అయితే సామాన్యుడికి మాత్రం ఇది అందనంత ఎత్తులో ఉండడం గమనార్హం. ఇకపోతే అప్పుడప్పుడు స్మార్ట్ మొబైల్స్ పై ధరలు తగ్గిస్తూ సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది యాపిల్ సంస్థ. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఉపయోగించే వారు వీటిలో అందిస్తున్న అధునాతన టెక్నాలజీ కి అలవాటు పడిపోయి సరికొత్త వేరియేషన్స్ తో ఈ మొబైల్ ను వాడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇకపై ఐ ఫోన్ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న IOS 16 రానే వచ్చింది.. ఇక ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను ఐ ఫోన్ లో అప్డేట్ చేసిన తర్వాత ఎలాంటి ఫీచర్స్ మనం పొందవచ్చో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.ఇటీవల యాపిల్ తన ఐఓఎస్ 16 ను లాంచ్ చేయడం జరిగింది.

గతంలో వచ్చిన లీకులు, రూమర్లు , హ్యాకర్ల బారిన పడకుండా తన ఆపరేటింగ్ సిస్టమ్ లో మార్పులు చేర్పులు చేస్తూ ఇటీవల 26న విడుదల చేయడం జరిగింది. WEDC కీనోట్ ఈవెంట్ లో యాపిల్ సంస్థ దీనిని లాంచ్ చేసింది. అయితే ఈ కొత్త ఫీచర్ ను మీరు పొందాలి అనుకుంటే మరో రెండు , మూడు నెలల పాటు ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను యాపిల్ ఐఫోన్ లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఐఫోన్8.. ఆ తర్వాత వచ్చిన వెర్షన్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారికి ఈ సరికొత్త ios అందుబాటులోకి ఉంటుంది. ఇక ఈ సరి కొత్త ఆపరేటింగ్ సిస్టం డెవలపర్ ప్రివ్యూ ఈ వారం చివరిలో విడుదల కానున్నట్లు యాపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.. ఇక అలాగే పబ్లిక్ బీటా నీ కూడా జూలై నెలలో ప్రవేశపెట్ట పోతున్నారట. ఇక ఈ ఐ ఓ ఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సరికొత్త ఫీచర్స్ ఏమిటీ అనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం చదివితెలుసుకుందాం..

The Top New Features in Apple iOS 16
The Top New Features in Apple iOS 16

ముఖ్యంగా IOS 16 ద్వారా లాక్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ను మెరుగు పరచడం జరిగింది. విడ్జెట్ తరహా సామర్థ్యం తో వాల్ పేపర్లను వినియోగదారులు యాక్సెస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా అప్ కమింగ్ క్యాలెండర్ ఈవెంట్లు, వర్కౌట్ స్టేటస్ లను కూడా వినియోగదారులు వెడ్జెస్ట్స్ గా యాడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక వాల్ పేపర్ గ్యాలరీ నుంచి విడ్జెస్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫోకస్ మోడ్స్ ను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఫోకస్ మోడ్ ను యాపిల్ ఫోన్ ios 15 ద్వారా పరిచయం చేసింది. అయితే ios 16 ద్వారా వాటిని మరింత మెరుగుపరుస్తూ తీసుకొచ్చింది. ఇకపోతే లాక్ స్క్రీన్ స్వైప్ చేయడం ద్వారా కూడా మీరు ఫోకస్ మోడల్స్ ను యాక్టివేట్ చేయవచ్చు. ఇక మీరు యాపిల్ వాలెట్ ను ఉపయోగించవచ్చు. యాపిల్ వాలెట్ కు షేరింగ్ ఫీచర్ ను కూడా తీసుకురానున్నట్లు సమాచారం . ఇతరులకు కూడా కీ షేర్ చేయడానికి ఐ.ఈ టీ ఎఫ్.ఇండస్ట్రీస్ స్టాండర్డ్ సపోర్టును పొందడానికి యాపిల్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ పే లెటర్ లాగా ఆపిల్ పే లెటర్ కూడా తీసుకొచ్చింది.

దీని ద్వారా వినియోగదారులు జీరో ఇంట్రెస్ట్ తో చెల్లింపులు చేయవచ్చు. పదకొండు సరికొత్త దేశాలలో రూట్ మ్యాప్ ను ఐడెంటిఫై చేసే విధంగా యాపిల్ మ్యాప్స్ ను కూడా ఈ IOS 16 ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఇక దీంతోపాటు గూగుల్ మ్యాప్స్ తరహాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వివరాలతో పాటు ట్రావెల్ కాస్ట్ వివరాలను కూడా మీరు ఈ మ్యాప్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది . ఇకపై ట్రావెల్ కాస్ట్ ను ముందే తెలుసుకొని ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించడం గమనార్హం. ఇక ios 16 ద్వారా మెసేజ్ లో అతిపెద్ద ఫీచర్లు తీసుకురావడం జరిగింది. ఇందులో మీరు మెసేజ్ లను ఎడిట్ కూడా చేయవచ్చు. అయితే ఇప్పటివరకు టెలిగ్రామ్ యాప్ లో మాత్రమే ఈ పద్ధతి అందుబాటులో ఉండగా ప్రస్తుతం IOS 16 ద్వారా కూడా అందుబాటులోకి వస్తూ ఉండడం గమనార్హం. ఇక దీంతోపాటు ఇంస్టాగ్రామ్ , సిగ్నల్ , వాట్సాప్ తరహాలో మెసేజ్లను డిలీట్ చేసే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.