Smart TV : స్మార్ట్ టీవీ కొనేవారికి శుభవార్త.. రూ.16 వేల లోపే..40 ఇంచ్ టీవీ..!

Smart TV : ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉండాలని కోరుకుంటారు. ఇక అందులో భాగంగానే స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. ఇకపోతే గతంలో కేవలం 32 ఇంచుల టీవీ ఉంటే చాలని అనుకునేవారు కానీ టెక్నాలజీ మారిపోతున్న నేపథ్యంలో ఫ్యాషన్ కూడా పెరుగుతున్న క్రమంలో చాలామంది 40 ఇంచ్ లు లేదా అంతకంటే ఎక్కువ సైజు ఉన్న స్మార్ట్ టీవీల కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ క్రమంలోనే 40 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి రూ.25 వేలపైనే బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. కానీ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 40 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.16 వేల లోపే అందించడానికి సిద్ధంగా ఉంది.

ఇన్ఫినిక్స్ సంస్థ నుంచి ఇన్ఫినిక్స్ ఎక్స్ వన్ సిరీస్ లో 32, 40,43 అంగుళాలు స్మార్ట్ టీవీలను అమ్మకానికి ఉంచిన నేపథ్యంలో ప్రస్తుతం 40 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.19,999 ధర కే ప్లాన్ చేయబడింది. ఇక ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ని మీరు ఫ్లిప్కార్ట్ లో రూ.16,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ ఆఫర్ తో కలిపి రూ.16,000 లోపే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించబడింది ఫ్లిప్ కార్ట్. ఇక ఎస్బిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10% తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.. ఇక అలాగే ఫ్లిప్కార్ట్ , యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఐదు శాతం తక్షణ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. ఈ ఎమ్ ఐ ద్వారా కొనుగోలు చేయాలనుకునేవారు రూ.590 నుంచి ఆఫర్ మొదలవుతుంది.

Good news for smart TV buyers 40 inch TV under Rs. 16 thousand
Good news for smart TV buyers 40 inch TV under Rs. 16 thousand

ఒకవేళ మీరు పాత స్మార్ట్ ఫోన్ టీవీ ని ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే రూ.11,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఇన్ఫినిక్స్ ఎక్స్ వన్ 40 అంగుళాల ఫుల్ హెచ్డి ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే..60 Hz రిఫ్రిజిరేటుతో డిస్ప్లే లభిస్తుంది. EPIC 2.0 పిక్చర్ ఇంజన్, హెచ్ డి ఆర్ , హెచ్ ఎల్ జి ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక 24 W సౌండ్ అవుట్ పుట్ కూడా లభిస్తుంది. డాల్బీ ఆడియో ఫీచర్ తో సౌండ్ పొందడం గమనార్హం. మీడియా టెక్ ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ టీవీ పనిచేస్తుంది. 170 డిగ్రీల వ్యూ యాంగిల్ లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇక నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యూట్యూబ్ వంటి యాప్లను సపోర్ట్ చేస్తుంది ఈ స్మార్ట్ టీవీ.