తరచూ గర్భస్రావం అవుతోందా.. అయితే ఈ చాక్లెట్ తినండి..!!

ప్రస్తుతం మార్కెట్లో కస్టమర్లను ఆకర్షించడానికి రకరకాల ఫ్లేవర్లతో తయారుచేసిన చాక్లెట్లను మనం చూస్తూనే ఉన్నాం. కానీ ముఖ్యంగా డార్క్ చాక్లెట్ గర్భవతులు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని వైద్యుల సైతం సలహా ఇస్తున్నారు . ముఖ్యంగా గర్భం విషయంలో కొంతమందికి కలిగేఅపోహలను దూరం చేయడానికి ఈ ఆర్టికల్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి గర్భవతులు తప్పకుండా తినాల్సిన ఈ డార్క్ చాక్లెట్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. నిజానికి గర్భం దాల్చడం అనేది దేవుడు ఇచ్చిన వరమని చెప్పవచ్చు . ఇప్పటికే ఎంతోమంది మహిళలు పెళ్లయిన తర్వాత గర్భం దాల్చడంలో సమస్యలు ఏర్పడి.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అలాంటివారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వైద్యులు సూచిస్తున్నారు ..

ముఖ్యంగా గర్భం దాల్చడం అనేది కేవలం స్త్రీ మాత్రమే కాదు పురుషుడు కూడా సమాన బాధ్యత వహిస్తాడు అని తెలుసుకోవాలి. ఇక ఇద్దరు కూడా సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సంయోగంలో పాల్గొంటే తప్పకుండా గర్భం దాల్చే అవకాశం ఉంటుందని కూడా సలహా ఇస్తూ ఉండడం గమనార్హం. కాబట్టి నూతన వధూవరులు ఎవరైనా సరే పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఇకపోతే గర్భం దాల్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలను తినాలని బుద్ధి పుడుతుంది. ఈ క్రమంలోనే కొంతమందిలో ఎక్కువగా చాక్లెట్ తినాలని ఆశ ఉంటుందట.. ఈ క్రమంలోనే చాక్లెట్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ చాలామంది మహిళల్లో ఉండే అపోహ ఏమిటంటే చాక్లెట్ తింటే గర్భానికి మంచిది కాదని , ఆ ప్రభావం బిడ్డ పై పడుతుందనే అపోహతో ఉంటారు.

Eat this chocolate if you have frequent miscarriages
Eat this chocolate if you have frequent miscarriages

కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అని చాక్లెట్ తింటే ఎలాంటి నష్టాలు జరగవని నిరూపించబడింది. ప్రీక్లాంప్సియా అనేది అధిక రక్తపోటు , గర్భధారణ సమయంలో గర్భాశయ పిండం పరిమితి పెరగడం, ప్రసూతి వల్ల కలిగే నష్టాలు, మూత్రంలో అధిక ప్రోటీన్ వెళ్లిపోవడం లాంటి వల్ల ప్రీక్లాంప్సియా ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సమస్య వల్ల నెలలు నిండకుండానే ప్రసవించడం.. మూర్చపోవడం, బిడ్డ చనిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి . కాబట్టి తొమ్మిదో నెలలో మహిళల్లో జరిగే ఎన్నో రకాల మార్పులను అరికట్టాలంటే డార్క్ చాక్లెట్ తినాలి ..దీనిని తినడం వల్ల ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవచ్చు. మొదటి మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే అవకాశాన్ని 20 శాతం వరకు తగ్గించవచ్చు. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే అధిక బరువును దూరం చేసుకోవడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. గర్భవతులు నిక్షేపంగా డార్క్ చాక్లెట్లు తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.