Popcorn : పాప్ కార్న్ఎక్కువగా తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే..!!

Popcorn : మొక్కజొన్న కంకులు, స్వీట్ కార్న్ అనే పేర్లతో వీటిని పిలుస్తూ ఉంటారు. అయితే వీటితో రకరకాల వంటకాలను కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. ముఖ్యంగా మొక్కజొన్న తో తయారయ్యే పాప్ కార్న్ ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా సినిమా హాల్ లో కి వెళ్ళినప్పుడు అక్కడ వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. మొక్కజొన్నలను కాస్త నూనెలో వేయిం చడం వల్ల అవి పాప్ కార్న్ గా మారుతాయి. ఈ పాప్ కార్న్ రుచిగా ఉండడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.

అయితే ముఖ్యంగా వీటిని నెయ్యిలో, ఉప్పులో మాత్రం వేయకూడదట. ఇలా వేసిన పాప్ కార్న్ ను ఎవరైనా తింటే వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉందట. పాప్ కార్న్ లో విటమిన్ -B కాంప్లెక్స్, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ వంటివి చాలా పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రించవచ్చ. షుగర్ ఉన్నవారు రక్తంలో షుగర్ లెవల్ పడిపోకుండా ఉండేందుకు వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది.

Do you eat a lot of popcorn but these things are for you
Do you eat a lot of popcorn but these things are for you

షుగర్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఫుడ్ చాలా అవసరం కాబట్టి వీటిని భేషుగ్గా తినవచ్చునని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ క్రియ మెరుగుపరిచేందుకు పాప్ కార్న్ లో అలాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయట. ఇందులో వుండే ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మలబద్దక సమస్య ఉన్నవారు కూడా వాటి నుంచి విముక్తి పొందవచ్చు. పాప్ కార్న్ లో ఉండే ఫైబర్ వల్ల రక్తనాళాల గోడలకు పేరుకుపోయిన కొవ్వు ను కూడా కలిగిస్తుంది. దీంతో మనకు ఎలాంటి సమస్యలు కూడా రావు.