Business Idea : ఇంటి నుండే లక్షల్లో ఆదాయం ఎలా అంటారా..?

Business Idea : జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఎవరైనా సరే ముందడుగు వేయాలి అంటే.. పట్టుదల కృషి ఆలోచన అన్నీ ఉండాలి. అప్పుడే మనం చేసే పని ఏదైనా సరే సవ్యంగా విజయవంతం అవుతుంది. ఇక ఇప్పటికే ఎంతోమంది డబ్బు సంపాదించే దిశలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ.. అందులో కొంతమంది విజయవంతం అవుతుంటే.. మరికొంతమంది ఫెయిల్యూర్ ను చవి చూస్తూ ఉన్నారు. చాలా మంది తమ వ్యాపారాలలో ఫెయిల్యూర్ చూడడానికి కారణం సరైన మార్కెటింగ్ చేయకపోవడం.. ఆ వ్యాపారం గురించి సరైన అవగాహన లేకపోవడం.. ఇక కష్టపడి పనిచేసినా.. వ్యాపారంలో అభివృద్ధి చెందకపోతే కొన్ని రకాల ప్రయత్నాలను కూడా చేయాల్సి ఉంటుంది. మీలో ఎవరైనా సరే వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు లాభనష్టాలు ఆలోచించకుండా తక్కువ పెట్టుబడి తో ఏదైనా వ్యాపారం ప్రారంభించవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది బయటకు వెళ్ళి వ్యాపారం చేయలేక ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అన్న ఆలోచనతో ఇంటి నుండే లక్షల్లో డబ్బు సంపాదించాలని ఆలోచిస్తున్నారు.

Advertisement

అందుకు తగ్గట్టుగానే కొంతమంది ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇకపోతే తాజాగా ఇంటి నుండే కొంతమంది కూరగాయలను పండిస్తూ లక్షల్లో లాభాలను పొందుతున్నారు.ప్రస్తుత కాలంలో కూరగాయల ధరలు మిన్నంటుతున్నాయి. గతంలో టమోటాలు కేజీ రెండు రూపాయలు అంటేనే గొప్ప విషయంగా అనిపించేది. కానీ నేటి కాలంలో వంద రూపాయలు ఒక కేజీ టమోటాలు వస్తున్నాయి అంటే.. కూరగాయల మార్కెట్ లో ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక కూరగాయలు పండించడానికి పెద్దగా స్థలం లేకపోయినా.. మట్టి అవసరం లేకపోయినా సరే.. కేవలం కొన్ని రకాల ఎరువులతో మీ ఇంటి మేడ పైన లేదా మీ ఇంటి చుట్టుపక్కల మీ పెరటిలో కూడా వీటిని పండించి లాభార్జన పొందవచ్చు. ప్రస్తుతం టెర్రస్ గార్డెనింగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది వీటి సాగుపై కృషి చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వాలు కూడా వీరికి సహాయం కూడా అందజేస్తున్నాయి. ఇకపోతే మీరు కూడా టెర్రస్ గార్డెనింగ్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకుంటే అందుకు తగిన ప్రణాళికలు ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసినా కూడా పెద్దగా ప్రయోజనం లేకుండాపోతోంది . ఇప్పుడు ఎంత డబ్బు పెరుగుతున్నా..

Advertisement
Business Idea of Growing vegetables
Business Idea of Growing vegetables

ఖర్చుల కారణంగా సరిపోవడం లేదని చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు.ఇంకొంత మంది మాత్రం తమకు ఇష్టమైన మొక్కల పెంపకాన్ని అలవాటుగా మార్చుకొన్న లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇక ఇటీవల ఒక అతను వెంటనే గార్డెన్ గా మార్చుకొని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10000 రకాలకు పైగా మొక్కలను నాటి సేంద్రీయ పద్ధతిలో పెంపకం చేపట్టారు. ఇక ఆయనకు మంచి దిగుబడి ఆదాయాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇక ఎటువంటి ఆలోచనలు లేకుండా అతడి సక్సెస్ స్టోరీ గురించి మనం ఒక సారి వివరంగా తెలుసుకుందాం. ఇక ఇటీవల ఉత్తర ప్రదేశ్లోని బరేలి కి చెందిన రాంవీర్ సింగ్ అతడి స్నేహితుడి తండ్రి క్యాన్సర్ బారిన పడగా.. వైద్యులు పరీక్షించి కూరగాయల ద్వారా రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా చేశాయి అని తెలియజేశారు .దీంతో ఆలోచనలో పడిన రాం వీర్ సింగ్ మనం తింటున్న కూరగాయలు ఎక్కడ పండుతున్నాయో తెలియదు.. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు.. ఎలా పండించాలో తెలియదు కానీ తింటున్నాము.. అందుకే ఇలా విషపదార్థాలకు బానిస అవుతా ఉన్నాము.

అందుకే ఎలాగైనా సొంతంగా పండించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే తన తన సొంత ఊరికి వెళ్లి అక్కడ ఆర్గానిక్ పద్ధతుల ద్వారా మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. అలా ఏకంగా పది వేల రకాలకు పైగా కాయగూరల మొక్కలను పండించడం మొదలుపెట్టారు. ఇకపోతే ఆర్గానిక్ పద్ధతుల ద్వారా ఖర్చు ఎక్కువవుతుందని ఆలోచించిన ఈయన మొదట్లో పంట బాగా వచ్చినప్పుడు ఇతరులకు కూడా ఆ కూరగాయలు అమ్మడం మొదలు పెట్టాడు. ఇక ఆ తర్వాత ఖర్చులు తగ్గించి లాభాలను పెంచే దిశగా..హైడ్రోపోనిక్స్ సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. అతి తక్కువ స్థలంలో మట్టి అవసరం లేకుండానే.. కేవలం నీటి గొట్టాలు, నీరు సరఫరా ద్వారా పంటలు పండించడమే హైడ్రోపోనిక్స్ విధానం.. ఇక ఈ విధానాన్ని స్నేహితుల ద్వారా తెలుసుకొని మొదలు పెట్టాడు. ఇక ప్రస్తుతం టమోటాలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికం, బెండకాయ, పచ్చి బఠాణీ ని ఇలా సుమారుగా పదివేల రకాలకు పైగా కూరగాయలను వాటి జాతులను పండిస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు.

Advertisement