Anasuya : ‘అతనితో’ ఒకే ఒక్క ఫోటో దిగిన అనసూయ.. కుర్రాళ్ళకి ఒళ్ళు మండిపోతోంది.!

Anasuya : బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు.. అనసూయ పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాలో తగ్గేదేలే డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు..! ఇప్పుడు అదే మ్యనరిజం తో అనసూయ హల్చల్ చేస్తుంది.. ఏకంగా అమెరికా లోని న్యూయార్క్ మేయర్ తో ఈ మ్యనరిజం తో ఒక పిక్ షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతుంది..

Anasuya took only one photo with him
Anasuya took only one photo with him

దసరా సందర్భంగా ఇటీవల న్యూయార్క్‌లోని తెలుగు సంఘం ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి యాంకర్ అనసూయ, సింగర్ మంగ్లీ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆ నగర మేయర్ పాల్గొని.. తెలుగు వాళ్లతో కలిసి బతుకమ్మ పండుగలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అనసూయతో కలిసి ‘తగ్గేదే లే‘ అని పుష్ప గెస్చర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈవీడియో చూసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
‘మా భారతీయ చిత్రం పుష్పపై ప్రేమని, అభిమానాన్ని చూపించినందుకు న్యూయార్క్‌ మేయర్‌కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

న్యూయార్క్‌ మేయర్ అనసూయ కలిసి దిగిన ఫోటోలు చూసిన కుర్రకారు మాత్రం.. కాస్త కోపంగా ఉన్నారు.. అనసూయ ను అంతా క్లోజ్ గా చూసిన వాళ్లు కాస్త హార్ట్ అయినట్టు తెలుస్తోంది.. తాజాగా అనసూయ నటిస్తున్న సినిమా అరి.. నిన్న ఈ సినిమాలోని పాత్రలనును రివీల్ చేశారు. జెలసీ పాత్రలో అనసూయ నటిస్తోంది.. ఈ సినిమా తో అనసూయ మళ్లీ ఫామ్ లోకి వస్తుందో రాదో చూడాలి..