Weight Loss : వేలాడే పొట్టతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ అద్భుతమైన చిట్కా మీకోసమే..!!

Weight Loss  : చిన్న పెద్ద అనే వయసు తో సంబంధం లేకుండా ఇటీవల కాలంలో చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాదు ఎంత డైట్ చేసినా కూడా వేలాడే పొట్ట తో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక వేలాడే పొట్టను తగ్గించాలంటే వంటింటి చిట్కాలు ఉత్తమమని చెప్పవచ్చు. నిజానికి ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మరియు ఇతర పదార్థాలను తిని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఊబకాయం సమస్యలు తగ్గించుకోవాలంటే వంటగదిలో ఉండే కొన్ని రకాల మసాలా దినుసులతో వేలాడే పొట్ట ను ఇట్టే కరిగించుకోవచ్చు.వంటగదిలో లభించే ప్రతి దినుసు లలో కూడా ఎంతో అద్భుతమైన పోషకాలు దాగి ఉన్నాయి. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. మసాలా దినుసులు గా చెప్పబడే మెంతులు, నువ్వులు ఆరోగ్యం విషయంలో చాలా బాగా పనిచేస్తాయి.

మెంతులు, నువ్వులను సరైన నిష్పత్తిలో , సరైన పద్ధతిలో.. సరైన సమయంలో ఉపయోగిస్తే ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు. ఏ గింజలు అయినా సరే నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం తెలిసిందే. అదేవిధంగా మెంతులు, నువ్వులను నానబెట్టి తినడం వల్ల ప్రయోజనాలు రెట్టింపవుతాయి.సాధారణంగా నువ్వులలో మనకు పీచు, ప్రొటీన్, ఫోలేట్, కాల్షియం , ఐరన్ ఎక్కువగా ఉంటాయి. అదనంగా, మెంతులలో మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం లు అధికంగా ఉంటాయి. అదే సమయంలో సోపులో విటమిన్లు, ఫైబర్, కాల్షియం, ఖనిజాలు మరియు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.

Weight Loss Tips So do these best exercises daily
Weight Loss Tips So do these best exercises daily

వీటితో వేలాడే పొట్ట ను కరిగించుకోవడం ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..మెంతులు అలాగే నువ్వులను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కడుపు నొప్పి, జీర్ణసంబంధిత సమస్యలు, అజీర్తి వంటి సమస్యలు అన్ని దూరం అవుతాయి. అంతేకాదు జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. వేలాడే పొట్టను కరిగించుకోవడం కోసం మెంతులు, నువ్వులను ఒక గిన్నెలో కలిపి అందులో కొద్దిగా నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి రెండు రోజుల పాటు ఆరనివ్వాలి. రోజు ఒక ఆఫ్ టేబుల్ స్పూన్ తిన్నట్లయితే అతి తక్కువ సమయంలోనే ఎంత వేలాడే పొట్ట అయినా సరే ఇట్టే కరిగిపోతుంది. ఇక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ ఆర్టికల్ ను వెంటనే వారికి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.