Vayyari Bhama Plant : వయ్యారి భామ కాదు.. విషపూరితం..

Vayyari Bhama: ప్రతి నిత్యం మన ఇంటి చుట్టుపక్కల లక్షల సంఖ్యలో కనిపించే వయ్యారి భామ మొక్క ను మనం చూసే ఉంటాము.. ఈ మొక్కను నక్షత్ర గడ్డి, ముక్కుపుడక పూల మొక్క, క్యారెట్ గడ్డి, ముక్కు పుల్లకు గడ్డి, చాందిని మొక్క , ముక్కుపుడక మొక్క, ఆపాది మొక్క అని రకరకాలుగా పిలుస్తుంటారు.. ఈ కలుపు మొక్క అత్యంత విషపూరితమైనది..!ఈ కలుపు మొక్క అతిత్వరగా ఏపుగా పెరిగి పంట పొలాలను నాశనం చేస్తుంది. దాంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వయ్యారి భామ మొక్క మనుషుల, పశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది..

పంటలకు ఎరువుగా వేసిన రసాయనాలను పీల్చివేస్తుంది.. 40 శాతం పంట దిగుబడి ను తగ్గించే గుణం ఈ మొక్క ఉంది. నత్రజని సూక్ష్మ ధాతువుల శాతాన్ని తగ్గిస్తుంది. ఈ చెట్టు పూల నుండి వచ్చే పుప్పొడి రేణువులు టమాటా, వంకాయ మొక్కలను వచ్చే పిందలను రాల్చడంతో పాటు పంట తెగుళ్లు కు కారణం అవుతుంది. ఈ చెట్టు పువ్వులు గాలికి ఎగురుకుంటూ మూడు కిలోమీటర్ల దూరం పాకి అక్కడ మళ్ళీ కొత్తగా మొలుస్తాయి.వయ్యారి భామ మొక్క వలన మనుషులకు ప్రమాదకరమైన ఎగ్జిమా, హై ఫీవర్, ఉబ్బసం బ్రాంకైటిస్ వంటి వ్యాధులు వస్తాయి. ఈ చెట్టు ఆకుల ను చేతులకు రాసుకుంటే స్కిన్ ఎలర్జీ వస్తుంది.

Side Effects Of Vayyari Bhama Plant
Side Effects Of Vayyari Bhama Plant

ఈ చెట్టు పూల పుప్పొడి ని గనక పిలిస్తే కళ్ళు, ఎర్రబడటం, జలుబు కనురెప్పల వాపు వస్తాయి. పొరపాటుగా ఈ చెట్టుకు జంతువులు తగిలితే వాటికి కూడా వెంట్రుకలు రాలిపోతాయి. ఈ మొక్కలు పశువులు కూడా దానాగా మేయవు. ఒకవేళ పశువులు దాణాగా తింటే దీర్ఘకాలికం లో అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చి పశువులు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. తెలుసుకున్నారుగా వయ్యారి భామ మొక్క ఎంత విషపూరితమైనదో.. మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే దూరంగా ఉండండి.