Weight loss : బరువు తగ్గాలంటే ఇలా చేయాల్సిందే..!!

Weight loss : ఇటీవల కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా రకరకాల ఫాస్ట్ ఫుడ్ , జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోయి విపరీతంగా బరువు పెరుగుతున్నారు. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోయిన అప్పుడు మనం లావుగా కనిపిస్తూ ఉంటాము. వాటిని కరిగించడానికి నానా రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏవి కూడా వర్కౌట్ అవ్వక ఇబ్బంది పడుతున్నట్లు అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించండి . తప్పకుండా బరువు తగ్గుతారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరి జీవితం తలకిందులు అయిందని చెప్పవచ్చు. అందుకే తీసుకునే ఆహారం మొదలు నిద్రించే పడకగది వరకు ప్రతి ఒక్కటి ఆచితూచి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం తప్పనిసరి.

బరువు అనేది అని ప్రమాదకరమైనది. దాని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇక అధిక బరువును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే.. సమయానికి తక్కువ మోతాదులో తినడం అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ వల్ల మీ కడుపు చాలాసేపు నిండినట్టుగా అనిపిస్తుంది కాబట్టి హెల్తి ఫుడ్ తినాలనే కోరిక కూడా మీకు కలగదు. ఇక రాత్రి పడుకునే ముందు పీనట్ బటర్ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది.

If you want to Weight loss you have to do this
If you want to Weight loss you have to do this

95 శాతం నీరు అధికంగా ఉండే పుచ్చకాయలు తినడం వల్ల ఆకలి సమస్య ఉండదు. ఫలితంగా బరువు తగ్గుతారు. డైటరీ ఫైబర్ , బీటాకెరోటిన్ , ఫ్లేవనాయిడ్స్ అధికం గా కలిగిన ఆపిల్స్ బరువు తగ్గించడంలో సహాయపడతాయి. రాత్రి నిద్రించే సమయంలో కూడా ఆపిల్ తీసుకోవడం వల్ల చక్కని ప్రయోజనాలు కలుగుతాయి. మనం తినే ఆహారానికి బదులుగా యాపిల్స్ తినడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. క్యారెట్ కూడా రాత్రి సమయంలో తినడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. ఇక ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫుడ్స్ ఉండే పిస్తా తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మీకు తెలిసిన వారు ఎవరైనా అధికబరువుతో బాధపడుతున్నట్లయితే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి