Health Tips : ఈ మొక్క‌ని ఇంట్లో పెంచండి.. ఆక్సిజ‌న్ పుష్క‌లంగా ఉంటుంది !

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌కి చాలా గుణ‌పాఠాలు నేర్పించింది. క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు అనేక మంది శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఎంతో మంది స‌మ‌యానికి ఆక్సిజ‌న్ అంద‌క ప్రాణాలు కోల్పోయారు. దీన్ని బ‌ట్టి చూస్తే మ‌న‌కు ఆక్సిజ‌న్ ఎంత ముఖ్య‌మో తెలుసుకోవ‌చ్చు. కొవిడ్ త‌రువాత అంద‌రు మొక్క‌ల పెంప‌కంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతున్నారు. ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే కాకుండా ఇంటి లోప‌ల కూడా మొక్క‌లు పెంచుకుంటే ఇంట్లోకూడా ఆక్సిజ‌న్ శాతం పెరుగుతుంది. ఇంట్లో ఎక్కువ‌మంది ఉన్నా, ఇరుకు గ‌దులు ఉండి గాలి వెలుతురు స‌రిగా లేనివారు ఈ మొక్క‌లు పెంచుకుంటే మంచిది.

ఎలాంటి మొక్క‌లు, ఏజాతి మొక్క‌లు పెంచుకోవాలో తెలుసుకుందాం. ఇంట్లో పెంచుకునే మొక్క‌ల‌ను ఇండోర్ ప్లాంట్స్ అంటారు. ఈ ఇండోర్ ప్లాంట్స్‌లో ఎక్కువ‌గా ఆక్సిజ‌న్ ఉప్ప‌త్తి చేసే మూడు మొక్క‌ల ను పెంచుకోవాలి అందులో మొద‌టిది జామియా మొక్క‌, స్నేక్ ప్లాంట్, పీస్‌లిల్లీ . సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఈ మూడు మొక్క‌ల‌ను ఒకే గ‌దిలో పెంచుకుంటే ఆ గ‌దిలో ఎక్కువ‌గా ఆక్సిజన్ లెవ‌ల్స్ పెరుగుతాయి. మూడు మొక్క‌లు దొర‌క‌నియెడ‌ల క‌నీసం స్నేక్ ప్లాంట్‌ను అయినా పెంచుకోండి.

Health Tips on Oxygen plants
Health Tips on Oxygen plants

స్నేక్ ప్లాంట్ లాభాలు : ఇండోర్ ప్లాంట్స్‌లో ఎక్కువ‌గా ఆక్సిజ‌న్ విడుద‌ల చేసే మొక్క‌ల‌లో స్నేక్ ప్లాంట్‌దే మొద‌టి స్థానం. ఇది ఒక్క ఆక్సిజన్ ఉత్ప‌త్తి చేయ‌డ‌మే కాకుండా ఈ మొక్క ఉన్న గ‌దిలో ప‌డుకున్న వారికి మంచి నిద్ర ప‌ట్టేలా చేస్తుంది. గాలిలోని ట్రైక్లోరెథిలిన్, బెంజీన్‌ లాంటి టాక్సిన్స్‌ను, ఫార్మాల్డిహైడ్ ను శుద్ధి చేస్తుంది.

జామియా మొక్క : ఈ మొక్క సాగోవ్నికోవ్, కుటుంబంలోని జామివ్ జాతికి చెందిన ఈ మొక్క‌లు మ‌ధ్య అమెరికా దేశానికి చెందిన‌వి ఇవి ఎక్కువ‌గా బ్రెజిల్, ప్లొరిడాలో ని క్యూబా న‌ది ఒడ్డున‌ ఎక్కువ‌గా పెరుగుతాయి. ఇది 1 టి నుంచి మూడు సెంటీమీట‌ర్లు ఉండే ఈ మొక్క అన్ని న‌ర్స‌రీల‌లో అందుబాటులో ఉంటున్నాయి.

పీస్‌లిల్లీ : పీస్‌లిల్లీ చూడ‌గానే మ‌న‌ల్ని ఎక్కువ‌గా ఆక‌ర్శిస్తుంది. ఏడాలో ఈ మొక్క‌కి రెండు లేదా మూడు పూలు మాత్ర‌మే పూస్తాయి. వెడ‌ల్పాటి ఆకులుతో, తెల్ల‌ని పువ్వుల‌తో ఎంతో అందంగా క‌నిపిస్తుంది. ఈ మూడు మొక్క‌లు ఇండోర్‌లో అవి ఆర్యోగ్యంగా పెరుగుతూ మ‌న‌కి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.