Health Benefits : ఆవాలే కాదు ఆకులతో కూడా ఈ లాభాలు ఉన్నాయనీ తెలుసా..

Health Benefits : ఆవాలు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు.. ఆవగింజ లేని కూర ఉండదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఆవాలనే కాకుండా వాటి ఆకులను కూడా కూరలలో వాడుతున్నారు.. ఆవలి నుంచి నూనెను కూడా తయారు చేస్తారు ఈ నూనె వంటలలో ఉపయోగిస్తే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఉపయోగపడుతుంది..ఆవ ఆకులను కూరగా, పప్పు, పులుసు, వేపుడు ఇలా రకరకాలుగా వంటలు చేసుకొని తినవచ్చు.

ఈ ఆకులను పచ్చిగా కూడా నమిలి మింగవచ్చు. ఆవాలను ఆహారంగా తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రకాల వ్యాధులను నయం చేస్తుంది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని తగ్గిస్తుంది. కొత్త కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. గర్భిణీ స్త్రీలలో ఐరన్ లోపం నివారిస్తుంది.ఆవాలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్ సమృద్ధిగా లభిస్తాయి.

Health Benefits Of Mustard Leaves
Health Benefits Of Mustard Leaves

ఇవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే క్యాల్షియం ఎముకలకు, దంతాలకు బలం అందించి దృఢంగా ఉండేలా చేస్తాయి. శరీరంలో తయారయ్యే క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తుంది. జలుబు, ఉబ్బసం, బ్రాంకైటిస్, నిమోనియాలో ఆవాలు బాగా పనిచేస్తాయి. తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడం తోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.