Health Benefits : సాధారణంగా ఖర్బూజా పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరీ ముఖ్యంగా వేసవికాలంలో ఉష్ణోగ్రత నుంచి ఎండ తాపం నుంచి శరీరాన్ని కాపాడటానికి ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అధిక శాతం నీటిని కలిగి ఉండడమే కాకుండా ఎక్కువ పోషకాలు కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ పండు తినడానికి మంచి రుచితో పాటు సుగంధ భరితమైన వాసనను కూడా వెదజల్లుతుంది. సాధారణంగా ఖర్భూజా ముక్కలో 53 క్యాలరీల శక్తి తో పాటు 12 గ్రాముల పిండి పదార్ధాలు అలాగే ఒక గ్రాము మాంసకృత్తులు మనకు లభిస్తాయి.
అంతేకాదు ఒక గ్రాము పీచు తో పాటు 23 మిల్లీ గ్రాముల సోడియం, విటమిన్ బీ 6, విటమిన్ ఎ, విటమిన్ సీ , క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియమ్, కెరోటినాయిడ్స్, నియాపిన్ వంటి అనేక పోషకాలు కూడా మనకు ఇందులో రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేయటంలో దీనిని మించింది లేదని చెప్పాలి. ఖర్బూజాలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలో తెల్ల రక్తకణాలు ఉత్తేజితమై రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. అలాగే విటమిన్-సి వల్ల మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా ఫ్రీరాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి.
ఖర్బూజా లో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చాలా చక్కగా పని చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఖర్భూజా ను తీసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఖర్బూజా లో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ సి కారణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. ఖర్భూజాలో వుండే పొటాషియం కారణంగా గుండె కి కావాల్సిన న్యూట్రియన్స్ ను అందిస్తుంది. గర్భిణీ స్త్రీలలో బిడ్డ పెరుగుదలకు చాలా చక్కగా సహాయపడుతుంది. అంతేకాదు సుఖ నిద్ర రావడానికి ఎంతో చక్కగా ఈ ఖర్బూజ సహాయపడుతుంది.