పుదీనా.. ప్రస్తుతం వెజ్ , నాన్ వెజ్ వంటకాలలో ఎక్కువగా పుదీనాను బాగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వంటకాలలో ఉపయోగించడమే కాకుండా జ్యూస్ అలాగే లస్సీ రూపంలో కూడా తయారు చేసుకొని మరీ ఉపయోగిస్తున్నారు. ఇకపోతే పుదీనాతో పచ్చడి చేసుకొని రైస్ లాంటి వంటలలో కి తింటూ ఉంటారు. ముఖ్యంగా సంవత్సరం పొడవునా మనకు లభిస్తూనే ఉంటుంది కాబట్టి దీని వల్ల ప్రయోజనాలు కూడా అంతే స్థాయిలో మనకు లభిస్తాయి. ఇకపోతే పుదీనాను చాలా సులువుగా కూడా ఇంటి పెరటిలో పెంచుకోవచ్చు.
పుదీనాను తినడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడమే కాకుండా చక్కటి నిద్రను కూడా పెంపొందించుకోవచ్చు. ఎవరైనా సరే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లైతే .. పుదీనా ను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడిని బాగా తగ్గించి చక్కటి నిద్ర ప్రసాదించే శక్తి పుదీనా ఆకులను ఉందని ఇటీవల వైద్యులు తెలియజేశారు. మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడేవారు పుదీనా ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల సమస్య తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కడుపులో ఉన్న మలినాలను దూరం చేసుకోవాలి అంటే తప్పకుండా పుదీనా తినాల్సిందే. ఇక జీర్ణక్రియ రేటును పెంపొందించుకోవడానికి మలబద్ధకం సమస్యను తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది.
పుదీనా టీ తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గడంతో పాటు చర్మం నిగారింపును కూడా పొందుతుంది. ముఖ్యంగా పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల పుదీనా ఆకుల రసం, 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ జ్యూస్ తాగడం వల్ల కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్ , అజీర్తి వంటి సమస్యలు దూరమవుతాయి. గొంతులో ఇన్ఫెక్షన్లు, గొంతు సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. జలుబు, గొంతు నొప్పి తో పాటు మహిళలో వచ్చే నెలసరి సమస్యలను దూరం చేసుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.