Hair Tips : సిల్కీ సిల్కీ జుట్టు కావాలి అనుకునేవాళ్ళు మాత్రమే చదవాల్సిన న్యూస్ !

Hair Tips : జుట్టు అమ్మాయిల అందాన్ని మరింత రెట్టింపు చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఈ మధ్యకాలంలో పని, ఒత్తిడి , తీసుకునే ఆహారంలో పోషకాలలోపం, సూర్యరశ్మి లాంటి తదితర కారణాల వల్ల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. జుట్టు పెరుగుదల కూడా ఆగిపోవడం, అధిక మొత్తంలో రాలిపోవడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి . ముందుగా జుట్టు రాలే సమస్యను సహజసిద్ధమైన చిట్కాలు పాటించి తగ్గించుకోవాలి అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. జుట్టు స్త్రీలకు అందాన్ని మరింత పెంచుతుంది కాబట్టి జుట్టును చాలా జాగ్రత్త గా చూసుకోవాలి. లేకపోతే చివర్లు చిట్లిపోవడంతో.. జుట్టు పెరుగుదల ఆగిపోయి , నిర్జీవంగా పలుచగా మారుతుంది. చాలా వేడిగా ఉన్న నీటిని తల స్నానానికి అసలు ఉపయోగించకూడదు. కేవలం గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే ఉపయోగించాలి.

చాలా వేడిగా ఉన్న నీరు జుట్టు కుదుళ్లను బలహీనపరిచి, జుట్టు పొడిగా మారడానికి కారణం అవుతుంది . ఫలితంగా జుట్టు చివర్లో చిట్ట్లు పోవడం , రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గోరువెచ్చని నీటిని ఉపయోగించడంతో పాటు గాఢత తక్కువ కలిగిన షాంపూలను ఉపయోగించాలి . అలాగే జుట్టుకు కండిషనర్ కూడా తప్పనిసరిగా అప్లై చేయాలి. తల స్నానం చేసిన వెంటనే జుట్టును దువ్వకూడదు. ఇలా చేయడం వల్ల జుట్టు బలహీనంగా ఉంటుంది . కాబట్టి వెంటనే రాలిపోతుంది. ఇక హెయిర్ డ్రయ్యర్ , ఎలక్ట్రిక్ హెయిర్ ప్రొడక్ట్స్ కి దూరంగా ఉండాలి. జుట్టును ఎప్పుడూ కూడా లూజ్ గా వదలకూడదు ఎప్పుడు ముడి వేసుకొని ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Hair Tips on Coconut oil or almond oil
Hair Tips on Coconut oil or almond oil

అంతేకాదు జుట్టు చివర్లు చిట్లిపోయి ఉంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కత్తిరించుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు జుట్టుకు ప్రోటీన్లను అందించే హెయిర్ ప్యాక్ ను మాత్రమే అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సిల్కీ గా ఉండాలని కోరుకునేవారు.. ఒక కప్పులో కొద్దిగా అరటి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలమాడుకు, జుట్టుకి మొత్తం అప్లై చేసి.. గంట తర్వాత తక్కువ గాఢత కలిగిన షాంపూతో తల స్నానము చేయడం వల్ల జుట్టు సిల్కీగా తయారవుతుంది అంతేకాదు తలస్నానం చేసే ముందు రోజు రాత్రి జుట్టుకు కొబ్బరినూనె లేదా బాదం నూనె అప్లై చేయడం వల్ల జుట్టుకు కావలసిన విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వరుసటి రోజు తల స్నానం చేస్తే మీ జుట్టు ఒత్తుగా , మెత్తగా సిల్కీ గా నిగనిగలాడుతూ ఉంటుంది.