Asthma Patients : ఆస్తమా రోగులకు చక్కటి ఆహార నియమాలు..!!

Asthma Patients : శీతాకాలం వచ్చిందంటే చాలు ఆస్తమా రోగులు ఎన్ని సమస్యలతో ఇబ్బంది పడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి వారు దుమ్ము , ధూళి, కాలుష్యంలో కూడా తిరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.. కరోనా తర్వాత మళ్లీ కాలుష్యం పెరగడంతో చాలామంది ఆస్తమా వ్యాధి బారిన పడుతున్నారు . రోజురోజుకు ఆస్తమా రోగుల సంఖ్య కూడా వేగంగా పెరిగిపోతోంది.. ఇక ఆస్తమా అంటే శ్వాస నాళాలు కుచించుకు పోయి అందులో అధికంగా శ్లేష్మం ఉత్పత్తి అయ్యే పరిస్థితినే మనం ఆస్తమా అని పిలుస్తాము.ఆస్తమా సమస్య వచ్చినప్పుడు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఒక్కొక్కసారి గుండెల్లో మంట.. ఊపిరి ఆగి పోవడం.. ఈల లాంటి శబ్దం రావడం.. ఊపిరి పీల్చుకున్నప్పుడు గుండె పట్టేసినట్లు ఉండడం.. దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి.

Good dietary rules for Asthma Patients
Good dietary rules for Asthma Patients

ఆస్థమా అనేది డయాబెటిస్ లాగా నయం చేయలేని వ్యాధి.. కానీ నియంత్రించవచ్చు . ఆస్తమా లక్షణాలను నియంత్రిస్తే సమస్యల నుంచి గట్టెక్కినట్టే.. దీర్ఘకాలిక శ్వాస సంబంధిత వ్యాధులలో ఇది కూడా ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి.. బయటకు రావడానికి కూడా వాయు నాళాలు ఉంటాయి. కానీ వివిధ కారణాల వల్ల కండరాలు కుచించుకుపోవడంతో నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది.ముఖ్యంగా ఆస్తమా బాధితులు కొన్ని రకాల ఆహార నియమాలను పాటించినట్లయితే ఆస్తమా లక్షణాలను తగ్గించుకోవచ్చు. విటమిన్ డి శరీరానికి కావలసినంత నిష్పత్తిలో తీసుకోవడం వల్ల చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమా సమస్యను తగ్గించవచ్చు. ముఖ్యంగా మనకు పాలు , గ్రుడ్లు , నారింజ రసం, సాల్మన్ చేపలు వంటి వాటిలో విటమిన్ డి లభిస్తుంది.

Good dietary rules for Asthma Patients
Good dietary rules for Asthma Patients

అలాగే సూర్యోదయం సమయంలో ఒక గంట సేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల కూడా మనకు విటమిన్ డి లభిస్తుంది. ముఖ్యంగా 6 నుంచి 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు ఇలాంటి ఆహారం ఒక భాగం చేయడం వల్ల ఆస్తమా లక్షణాలను తగ్గించవచ్చు.ముఖ్యంగా 2018 వ సంవత్సరంలో జరిగిన అధ్యయనంలో ఎక్కువగా ఆస్తమా రోగుల్లో విటమిన్ ఏ లోపించినట్లు తేలింది . కాబట్టి విటమిన్ ఎ అధికంగా ఉండే చిలకడదుంప , బ్రోకలీ, ఆకుకూరలు, క్యారెట్ వంటివి తీసుకోవడం వల్ల విటమిన్ ఏ లోపం సరిచేయవచ్చు. మెగ్నీషియం అధికంగా లభించే పాలకూర , డార్క్ చాక్లెట్ , గుమ్మడికాయ గింజలు తినడం వల్ల ఆస్తమా ను తగ్గించుకోవచ్చు.