Hair Tips : జుట్టు అధికంగా రాలిపోతుందా.. అయితే ఈ చిట్కా మీకోసమే..!!

Hair Tips : ఎప్పుడైతే తలలో చర్మం పొడిబారి పోతుందో.. అప్పుడు జుట్టు రాలే సమస్య లు అధికమౌతాయి. ఇక జుట్టురాలడాన్ని ఎవరు తట్టుకోలేరు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే మంచి ఉపశమనం ఉంటుంది. ఇటీవల కాలంలో జుట్టు అందంగా.. పొడువుగా పెరగాలని లేనిపోని హెయిర్ మాస్కులు, క్రీములు, హెయిర్ ఆయిల్ లాంటివి వాడుతూ .. జుట్టు ను పాడు చేసుకుంటున్నారు. ఇక మనిషి అందానికి ముఖ ఛాయ ఎంత ముఖ్యమో.. కేశాలు కూడా అంతే ముఖ్యం. కానీ సగటు జీవి జుట్టు రాలిపోతే చూసి తట్టుకోలేరు. కాబట్టి అందాన్ని రెట్టింపు చేసే కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ఆ చిట్కాల వల్ల జుట్టు పొడవుగా పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుంది.హెయిర్ ఆయిల్స్ లో ఉండే ఫోలికల్స్, స్కాల్ఫ్ కి పోషణను అందిస్తాయి. తేమను నిలుపుకోవడం లో సహాయపడతాయి. ఇక జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా నూనె చాలా అవసరం. కాబట్టి ఎప్పుడూ కూడా జుట్టు ని కడిగిన తర్వాత పూర్తిగా నూనె రాయాలి. మీ జుట్టు సంరక్షణ దినచర్యలో భాగంగా చేసుకోవడం తప్పనిసరి. జుట్టు తేమగా ఉంచుకోవడం కి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను ఉపయోగించవచ్చు. లేదా ఉసిరి , గులాబిరేకల నూనె, రీత మొదలైన వాటితో కూడా జుట్టుకు తేమను అందించవచ్చు.వారానికి కనీసం రెండుసార్లు జుట్టును శుభ్రం చేసుకున్న తర్వాత నూనె రాయాలి

Excessive Hair loss This tip is for you
Excessive Hair loss This tip is for you

అని సౌందర్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.ఇక ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇక ఆహారం విషయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. జీలకర్ర, పసుపు, అల్లం, తేనె, నెయ్యి , గింజలు లాంటివి చేర్చుకోవడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. అంతే కాదు ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు దూరంగా మార్చగలవు. ఇక జుట్టు కడిగే ముందు గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయడం వల్ల జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది. మీ చెల్లి, అక్క, అన్నా, తమ్ముడు, వదిన, అత్త ,అమ్మ, మామ , నాన్న ఇలా ఎవరైనా సరే జుట్టు రాలిపోతోందని బాధపడుతున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ను వాట్సాప్ ద్వారా షేర్ చేయండి.