Health Tips : ప్రకృతి నుంచి మనకు లభించే ఎన్నో సహజ సిద్ధమైన మొక్కలలో ప్రతి మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే ఈ మొక్కలను మనం కరెక్ట్ గా సద్వినియోగం చేసుకున్నట్లయితే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక అలాంటి మొక్కలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది వేప చెట్టు. హిందూ సాంప్రదాయం ప్రకారం వేప చెట్టును దేవతా వృక్షం గా పరిగణిస్తారు. అయితే ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు కూడా అంతే రీతిలో మనకు లభిస్తాయి. ఇక వేపాకులను ఆయుర్వేద నిధిగా కూడా భావిస్తారు. వేప ఆకులను ఖాళీ కడుపుతో తింటే కచ్చితంగా ఎన్నో రోగాలను దూరం పెట్టవచ్చు.
ఇకపోతే ఉదయాన్నే ఐదు లేదా ఆరు వేపాకులను తినడం వల్ల రక్త సమస్యతో బాధపడేవారు వెంటనే ఇలా చేయడం వల్ల రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు . రక్తహీనత సమస్యను తీర్చడంలో చాలా సమర్థవంతంగా సహాయపడతాయి. మలబద్దక సంబంధిత సమస్యలతో బాధపడేవారు వేపాకులు నములుతూ ఉండడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా అలాగే ఫైబర్ కారణంగా సుఖ విరోచనాలు దూరం అవుతాయి. వేప ఆకుల వల్ల సహజమైన మెరుపును చర్మానికి తీసుకురావచ్చు. ముఖంపై ఉండే మచ్చలు , మొటిమలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా మొటిమలు అధికంగా ఉన్నప్పుడు పసుపు , వేపాకులను మెత్తగా పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేసుకుంటే..
అతి తక్కువ సమయంలోనే మొటిమలను, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను దూరం చేసుకోవచ్చు.పరగడుపున వేపాకులను తినడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ , యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాల వల్ల శరీరానికి వచ్చే అనేక ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు. ఇక డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజూ ఉదయాన్నే వేపాకులను నమలడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇక చర్మ సంబంధిత సమస్యలు దూరం చేసుకోవడానికి కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇలా వేపాకు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి వాట్సాప్ లేదు ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసి సమాచారాన్ని అందించండి.