High Blood Pressure : అధిక రక్తపోటును అదుపు చేసే తాజా పండ్లు ఏమిటో తెలుసా..?

High Blood Pressure : వాతావరణంలో మార్పు లు.. తీసుకునే ఆహారంలో పోషకాల లోపం .. మారుతున్న పరిస్థితులు.. పని ఒత్తిడి.. కుటుంబ బాధ్యతలు.. చెడు అలవాట్లు లాంటి తదితర కారణాల వల్ల చిన్న వయసులో కూడా రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. వయసు తో సంబంధం లేకుండా ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల చాలా మంది అధిక రక్తపోటు సమస్యకు గురి అవుతున్నారు. వాస్తవానికి 50 సంవత్సరాలు దాటిన వారికి గతంలో అధిక రక్తపోటు వచ్చేది.. కానీ ఇటీవల మారుతున్న పరిస్థితుల కారణంగా 25 సంవత్సరాల వయసు పైబడితే చాలు ఇలాంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు మాత్రమేకాదు గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Do you know what are the fresh fruits that control High Blood Pressure
Do you know what are the fresh fruits that control High Blood Pressure

ఇంతటి ప్రాణాంతకమైన అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి కొన్ని రకాల పండ్లు అలాగే ఆహార పదార్థాలు సహాయపడతాయి. ఇక దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు. కాబట్టి అధిక రక్తపోటును అదుపులో ఉంచే పండ్లు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు : అరటి పండులో అధికంగా యాంటీఆక్సిడెంట్ లతోపాటు ఫైబర్ , పొటాషియం, కొవ్వు ఆమ్లాలు, ఒమేగా త్రీ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అల్పాహారం తర్వాత , మధ్యాహ్నం భోజనం తర్వాత మాత్రమే తీసుకోవాలి.

చిలకడ దుంపలు : దుంప జాతికి చెందిన దీనిని ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది . ముఖ్యంగా బీటాకెరోటిన్, ఫైబర్, క్యాల్షియం వంటివి లభించడం వల్ల ఒత్తిడిని తగ్గించి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.

పెరుగు : పెరుగు కూడా అధిక రక్తపోటును అదుపు చేస్తుంది. వాస్తవానికి పెరుగులో రక్తపోటును నియంత్రించే లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రోటీన్, రిబోఫ్లావిన్, విటమిన్ బి12 , విటమిన్ బి 6 వంటి పోషకాలు ఉండడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.