Health Benefits : ప్రకృతి లో లభించే వాటికి ఎక్కువగా అన్నిటికి ఉపయోగపడుతూ ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.. అలాంటి సీజన్లు పండేటువంటి పనులలో నేరేడు పండు కూడా ఒకటి. సీతారాములు వనవాసంలో ఉన్న సమయంలో ఎక్కువగా ఈ నేరేడు పండ్లనే ఎక్కువగా తింటూ ఉండేవారు. అందుచేతనే మన దేశంలో వివిధ ప్రాంతాలలో కూడా ఈ నేరేడు పండుని దేవత ఫలంగా భావిస్తూ ఉంటారు. నేరేడు పండు తిన్నట్లయితే తక్షణమే శక్తి కూడా లభిస్తుంది. కొన్ని రకాల రోగాలను నియంత్రించడానికి నేరేడు పండు చాలా సహాయపడుతుంది.కేవలం నేరేడు పనిలే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడు గింజలు వంటి వాటిలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
అందుచేతనే వీటిని ఆయుర్వేదంలో పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నేరేడు ఆకులను ఎక్కువగా పట్టుపురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. అయితే నేరేడు ఆకులతో కలిగే ప్రయోజనం గురించి ఇప్పుడు మనం చూద్దాం. నేరేడు ఆకులలో ఎక్కువగా యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వల్ల ఇవి శరీరం వ్యాధిబారిన పడకుండా చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రహస్తులకు ఈ నేరేడు ఆకులు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. నేరేడు ఆకులు మలబద్ధకాన్ని, అలర్జీలను తగ్గిస్తాయి. నేరేడు ఆకు రసాన్ని నోటిలో వేసుకొని పుక్కిలించడం వల్ల దంత సమస్యలు కూడా తగ్గుతాయి. మన చేతులు , కాళ్లు మంటలు వేసినట్లు అయితే నేరేడు ఆకుల రసాన్ని తేనె లో కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.
కిడ్నీలోని రాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది దివ్య ఔషధమని చెప్పవచ్చు. నేరేడు ఆకులను తీసుకొని.. బాగా శుభ్రంగా కడిగి కాటన్ అవసరం పైన ఆర వేయాలి.. తడి లేకుండా ఉన్న ఆకులను తీసుకొని.. కొన్ని మిరియాలు కలిపి బాగా వాటిని పేస్టులాగా నూరి.. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ప్రతిరోజు తాగడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా కణితులను నివారించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక నేరేడు ఆకులు మాత్రమే కాదు నేరేడు పండ్లు కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ముఖ్యంగా మగవారిలో శుక్రకణాలు ఆరోగ్యంగా ఉండేలాగా ఇవి కాపాడతాయి.. ఇక సంతానం కోసం ఎదురు చేస్తున్న వారు నేరేడుపళ్ళ ను తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.