TEA : టీ ఎక్కువగా తాగుతున్నారా .. అయితే ఈ విషయాలు మీకోసమే..!!

TEA : గొంతులో వేడి వేడి కప్పు టీ పడనిదే చాలామందికి రోజు మొదలవ్వదు. ఈ కాలంలో చాలా మంది టీ కి అలవాటు పడిపోయారు. కాబట్టి రోజులో కనీసం 5 సార్లు అయినా టీ తాగడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంత హానికరమో గుర్తించలేకపోతున్నారు. ఇక టీ తాగడం అనేది శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. అంతే కాదు కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు. టీ ఎక్కువగా తాగేవారు అనారోగ్య విషయాలను గురించి పక్కన పెడితే ఆరోగ్య విషయాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

ముఖ్యంగా టీ ని ఎక్కువగా తాగే అలవాటు ఉన్న వారి గురించి ఒక అధ్యయనం జరపగా ఆశ్చర్యపోయిన ఆరోగ్య ప్రయోజనాలు బయటపడ్డాయి. ముఖ్యంగా టీ ఆకులలో యాంటిఆక్సిడెంట్ లు అధిక మొత్తంలో ఉంటాయి. కాబట్టి రక్తం నుంచి హానికరమైన అణువులను బయటకు పంపించడం లో సహాయపడతాయి. రోజు ఒక కప్పు టీ తాగడం వల్ల గుండె సమస్యల ప్రమాదాన్ని 4 శాతం తగ్గించుకోవచ్చని, యువకులలో మరణించే ప్రమాదాన్ని 1.5 శాతం తగ్గించవచ్చని పరిశోధన ద్వారా వెల్లడైంది.

Do you drink a lot of Tea but these things are for you
Do you drink a lot of Tea but these things are for you

వేడిగా ఉండే టీ తాగడం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడంలో ఫ్లేవనాయిడ్స్ సహాయపడతాయని రుజువయ్యింది. రోజూ ఒక కప్పు టీ తాగడం వల్ల అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారు టీ తక్కువగా తాగడం మంచిది . ఎందుకంటే కొన్ని అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి అంటే వేడి టీ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందట. ముఖ్యంగా టీ లో లో చాలా రకాల హెర్బల్ టీ లు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు ఒక కప్పు టీ తాగడం వల్ల డిమెన్షియా వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట.