Sleep : వారికి నిద్ర అవసరం ఎక్కువే.. ఎందుకంటే..?

Sleep : సాధారణంగా ఆడవారి కంటే మగవారు ఎక్కువ సేపు నిద్ర పోతారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ వైద్య శాస్త్రం ఏం చెబుతోంది అంటే మగవారి కంటే ఆడవారికి ఎక్కువ సేపు నిద్ర అవసరం అవుతుందట. ఇకపోతే సామాజిక వ్యక్తిగత లావాదేవీలపై విధించిన ఆంక్షల కారణంగా కరోనా మహమ్మారి వచ్చిన రోజు నుంచి ప్రజలు తమ జీవితాలను గణనీయంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం పేరిట ఇంట్లోనే ఉద్యోగాలు చేసేవారు , అలాగే పిల్లలు కూడా ఇంట్లోనే చదువుకోవడం, ఆర్థిక కష్టాలు, ఒత్తిడి స్థాయి పెరిగి పోవడం , నిద్ర సమయం తగ్గడానికి కారణం అవుతున్నాయి. సరైన పోషకాహారం తీసుకోవడం , సరైన పద్ధతిలో వ్యాయామం చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం చేసుకోవచ్చు. శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంత స్థాయిలో పూర్తిగా నిద్ర పోయినప్పుడే శరీర అవయవాల పెరుగుదల మెరుగుపడుతుంది. ఇకపోతే నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు డిప్రెషన్, ఆందోళన, గుండె పోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ , రొమ్ము క్యాన్సర్ తో పాటు ఇతర శారీరక రుగ్మతలకు కూడా దారి తీయవచ్చు.

ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోతారో అప్పుడు ఖచ్చితంగా మంచి జీవక్రియకు సహాయ పడటమే కాకుండా శరీరంలో వివిధ అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. శారీరక శ్రమ ఎక్కువ అయినప్పుడు మంచి నిద్ర వస్తుంది అని నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. కానీ నిద్ర రావడానికి శారీరక శ్రమ అవసరం కదా అని ఎటుపడితే అటు విపరీతంగా శరీరానికి శ్రమ పెట్టకూడదు. నియమ నిబంధనలతో కూడిన పనులు చేయడంవల్ల హాయిగా నిద్రపోవచ్చు. ముఖ్యంగా మంచి నిద్ర అనేది రోజువారీ పనులను చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. ఇక కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి , ఉద్యోగాలలో ఇబ్బందులు ఇలా ఎన్నో కారణాల వల్ల మహిళలు ఎక్కువగా నిద్రలేమి సమస్యకు గురి అవుతున్నారు. తాజా అధ్యయనాల ప్రకారం బిజీ జీవనశైలిలో పురుషులు, మహిళలు ఇద్దరు కూడా గణనీయంగా నిద్ర రుగ్మతలకు ప్రభావితం అవుతున్నారు. కావలసిన శక్తిని పొందడానికి మాత్రం తగినంత నిద్ర ఉండడం లేదు. ఇక అంతే కాదు పురుషులతో పోలిస్తే మహిళలు మరింత తీవ్రంగా శ్రమకు గురి అవుతున్నారని ..ఫలితంగా నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

Because they need more sleep
Because they need more sleep

ఇక మానసిక లేదా శారీరక స్థితి కి సంబంధించి నేడు ఎక్కువ మంది మహిళలు స్లీప్ ఆప్నియా సమస్యతో బాధపడుతున్నారు.ఆడవాళ్ళలో రుతుక్రమం ఆగిపోవడం, ఊబకాయం, థైరాయిడ్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. గర్భిణీ స్త్రీల మాదిరిగానే సాధారణ స్త్రీలు కూడా ఎన్నో సమస్యలకు గురిఅవుతున్నట్లు అధ్యయనాలలో వెల్లడించడం జరిగింది. ఇకపోతే భారతదేశంలో దాదాపుగా 28 మిలియన్ల మంది ప్రజలు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని.. అందులో పురుషులు 14 శాతం.. స్త్రీలు 12 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం పురుషులు అలాగే మహిళలు కూడా నిద్ర రుగ్మతల యొక్క విభిన్న లక్షణాలను అనుభవిస్తున్నట్లు వారు స్పష్టంచేశారు.మగవారితో పోల్చుకుంటే ఆడవారికి ఎక్కువ నిద్ర అవసరం. అంటే ప్రతి రాత్రి సుమారు 20 నుండి 30 నిమిషాలు మగవారి కంటే ఎక్కువ సేపు నిద్ర పోవటం. ఇక 37 శాతం మంది మహిళలు తమ భర్తల నిద్రలో గురక వల్ల నిద్ర పోవడం లేదు అని తేలింది.

కాబట్టి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవాలి అంటే తప్పకుండా 8 గంటల సమయం నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేమి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం , కళ్ళు ఎర్రబారపోవడం, ముడతలు ఇలాంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా నిద్రించేటప్పుడు కూడా బిగుతుగా ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. పూర్తిస్థాయిలో నిద్ర పోవాలి అంటే పగటిపూట నిద్రపోవడం తగ్గించాలి. ఇక కెఫిన్ , ఆల్కహాల్, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సాధారణ నిద్ర షెడ్యూల్ ను అనుసరించడం , మొబైల్ , ల్యాప్ టాప్, టీవీ వంటి వాటికి కొంచెం దూరంగా ఉండడం, పడకగదులు వీలైనంత చల్లగా , చీకటిగా, నిశ్శబ్దం గా ఉంచుకోవడం లాంటివి చేస్తే నిద్రలేమి సమస్య నుంచి దూరం కావచ్చు. ఇక ఫలితంగా ఆడవారి అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. జబ్బుల బారిన పడకుండా ఉంటారు.