Beauty Tips : ఈ ఆకు తో మీ అందం రెట్టింపు అవ్వాల్సిందే..!!

Beauty Tips : సాధారణంగా కొన్ని రకాల ఆకు కూరల్లో కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందించే లక్షణం ఉంటుంది. అలాంటి ఆకుకూరలలో కొత్తిమీర మొదటి ప్రాధాన్యత వహిస్తుంది. ఇటీవల కాలంలో చాలా మంది కొత్తిమీరను ప్రతి వంటకాలలో కూడా విరివిగా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఉపయోగించడం వల్ల ఆరోగ్యమే కాదు మంచి రుచి, సువాసన కూడా లభిస్తుంది. ఇక అంతేకాదు కొత్తిమీర సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు తెలియజేస్తున్నారు.. అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..ముందుగా కొత్తిమీర తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ చర్మ సంరక్షణను కాపాడడంలో మొదటి పాత్ర వహిస్తుంది.

ఒక గిన్నెలో పచ్చి కొత్తిమీర ఆకుల వేసి.. రెండు చెంచాల అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి.. మనీ ముఖంపై అప్లై చేయడం వల్ల మొటిమలు దూరం అవడమే కాదు.. ముడతలు కూడా తొలగిపోతాయి.కొత్తిమీర పేస్ట్ లో బియ్యం పిండి కలిపి ముఖానికి ఫేస్ వేసుకున్నా సరే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

Beauty Tips in Coriander Face Pack
Beauty Tips in Coriander Face Pack

ఇకపోతే కొత్తిమీర పేస్టు లో పెరుగు వేసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం మీద ఎండాకాలంలో వచ్చే ట్యాన్ కూడా తొలగిపోతుంది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసిన తర్వాత గంట సేపు విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే మంచి లాభాలు కలుగుతాయి.ఇక వేసవిలో చర్మం పొడిగా మారినట్లయితే కొత్తిమీర పేస్ట్ లో తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. తేనె లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని లోపల్నుంచి మృదువుగా మారుస్తాయి.