Asthma : ఆస్తమాకు ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టవచ్చు..!

Asthma : నేటి కలుషిత వాతావరణంలో చాలా మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు వారి పరిస్థితి అధ్వానంగా మారుతోంది. అంటే ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు కూడా ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా అనేది శ్వాస నాళం చుట్టూ కండరాలు బిగుతుగా మారడం వల్ల శ్వాసనాళాల్లో శ్లేష్మం పేరుకుపోయి ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఆస్తమా ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది .. ఛాతీ నొప్పి.. దగ్గు.. ఒక్కొక్కసారి తలనొప్పి రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఇలాంటి సమస్య ఉన్నవారు చికిత్సలో భాగంగా కొన్ని కూరగాయలను ఉపయోగిస్తారు . అయితే ఆస్తమా సమస్య ను తగ్గించాలి అంటే కొన్ని రకాల పండ్లు, కూరగాయలు తీసుకోవడం చాలా అవసరం. వీటిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్తమా ను తగ్గించుకోవచ్చు.క్యాప్సికమ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి తో పాటు ఫైటో న్యూట్రియంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇక శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఆహారంలో క్యాప్సికం చేర్చుకుంటే శ్వాసకోశ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. అంతే కాదు శ్వాసకోశ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

Asthma can be checked with these foods
Asthma can be checked with these foods

దానిమ్మ గింజల లో ఫైబర్ , విటమిన్ కె, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభించడం వల్ల ఊపిరితిత్తులలోని కణాలకు నష్టం జరగకుండా చేస్తాయి. కాబట్టి శ్వాసకోస వ్యాధులు ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు దానిమ్మ రసం లేదా దానిమ్మ గింజలు తినడం వల్ల సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.అల్లం తో తయారు చేసిన టీ లేదా మనం వన్డే వంటల్లో ఉపయోగించడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి . అలాగే DNA దెబ్బతినకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు , అధిక రక్తపోటు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక అలాగే పాలకూర , టమాటా రసం, ఆపిల్ పండ్లు, ఆకు పచ్చ బఠాణీలు , నారింజ పండ్లు లాంటివి చేర్చుకోవడం వల్ల ఆస్తమా నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.