Tan: ట్యాన్ ను తొలగించే అద్భుతమైన చిట్కా..!!

Tan:   చర్మం పై ట్యాన్ పేరుకుపోవడం వల్ల ఎంత అందంగా ఉన్నా సరే చర్మం కాంతివంతంగా మారిపోతూ ఉంటుంది. ఒక ఎప్పుడైతే చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయో అప్పుడు ట్యాన్ సమస్య వస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇటీవల కాలంలో ముడతలు,  మొటిమలు వంటి సమస్యలతో పాటు ఈ ట్యా న్ సమస్య కూడా ఆడవారిని ఎక్కువగా వేధిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు డెడ్ స్కిన్ సెల్స్ ను  తొలగించుకోవాలి అని సౌందర్య నిపుణులు సైతం సలహా ఇస్తుంటారు. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీ ని ట్రై చేస్తే గనుక ఇంట్లోనే చర్మంపైన పేరుకుపోయిన ట్యాన్ ను  వదిలించుకోవచ్చు.


ఇక మీ ఇంట్లో అక్క , చెల్లి , అత్త , అమ్మ , వదిన ఇలా ఎవరైనా సరే ఇలాంటి చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే వెంటనే వారికి ఈ ఆర్టికల్ ను  వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి. ఇకపోతే చర్మంపైన పేరుకుపోయిన మృత కణాలను అలాగే ట్యాన్  ను తొలగించడానికి ఉపయోగపడే చిట్కా ఏమిటి అనే విషయానికి వస్తే.. ఒక క్యారెట్,  ఒక బంగాళదుంప తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లెండర్ లో వేసి , కొద్దిగా నీళ్ళు కూడా పోసి మెత్తటి పేస్టులాగా గ్రైండ్ చేసుకోవాలి.


ఒక కాటన్ క్లాత్ లో ఈ పేస్ట్ వేసి జ్యూస్ ను మాత్రం సపరేట్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి.. ఒక గిన్నె పెట్టి అందులో మిక్సీ పట్టుకున్న జ్యూస్ వేయాలి. జ్యూస్ వేసిన వెంటనే ఒక టేబుల్ స్పూన్  జెలిటిన్ పౌడర్ కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి,  స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక దీనిని ముఖానికి బ్రష్ సహాయంతో మందంగా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఇప్పుడు సున్నితంగా మాస్క్ ను తొలగించాలి . వారానికి రెండు సార్లు కనుక మీరు ఈ చిట్కాలు పాటించినట్లయితే చర్మంపై మృతకణాలు తొలగిపోయి , చర్మం ఛాయ పెరుగుతుంది. ముడతలు,  మొటిమలు తొలగిపోవడమే కాదు నిగనిగలాడే అందం మీ సొంతం అవుతుం