Health Benefits : తంగేడు చెట్టుతో ఈ ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..!?

Tangedu Plant: పసుపుపచ్చని బంగారు వర్ణంతో తంగేడు పూల చెట్టు ని మనలో అందరం చూసే ఉంటాం.. చూపరులను ఆకట్టుకుంటాయి ఈ చెట్టు పూలు.. ఈ చెట్టు ఆకులు, బెరడులో ఔషధ గుణాలు ఉన్నాయి.. ఇవి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందంటే..అరికాళ్ళ మంటలతో బాధపడుతున్న వారు ఈ చెట్టు ఆకులను దంచి రసం తీసుకోవాలి . పాదాలను శుభ్రంగా కడిగి ఈ ఆకుల రసం రాసి మర్దన చేస్తూ ఉంటే అరికాళ్ళ మంటలు త్వరగా తగ్గుతాయి.

తంగేడు ఆకులను ఆకులను రసం తీసి అందులో తెల్ల ఉల్లిపాయలు వేసి ఉడికించి ప్రతిరోజు ఒక మోతాదులో తీసుకుంటూ ఉంటే రేచీకటి సమస్య తగ్గుతుంది. ఎముకలు విరిపోయినా, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఈ చెట్టు ఆకులను కోడి గుడ్డు తో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని పట్టుగా వేస్తే విరిగిన ఎముకలు అతుక్కుంటాయి. తంగేడు ఆకులలో పసుపు కలిపి నూరి ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే శరీరం నుంచి ఎటువంటి దుర్వాసన రాదు.

Amazing Health Benefits Of Tangedu Leaves and Beradu
Amazing Health Benefits Of Tangedu Leaves and Beradu

చర్మ రోగాలు తగ్గుతాయి. తంగేడు ఆకులు చిగుళ్ళను మజ్జిగలో కలిపి నూరి పాదాల మడమలకు రాస్తే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.ఈ ఒక్క బెరడులో ట్టాన్లి ఉన్నాయి.. తంగేడు పుల్ల తో దంతాలు తోముకుంటే సమస్త దంత సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి పూత కూడా తగ్గుతుంది. ఈ చెట్టు వేరు బెరడును ఆవు మజ్జిగలో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని తీసుకుంటే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది. ఈ చెట్టు బెరడు కషాయం తో కడుపునొప్పి తగ్గుతుంది.