Beauty Tips : ముఖం పై వచ్చే మొటిమలను దూరం చేసే చక్కని చిట్కా..?

Beauty Tips : ఈ రోజుల్లో చాలామంది ముఖంపై మొటిమలు, మచ్చలు, ట్యాన్ వంటి సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇకపోతే కొన్ని మార్కెట్లో దొరికే క్రీములను ఉపయోగించి డబ్బు ఖర్చు చేసుకుంటున్నారే తప్ప వాటి వల్ల ఎటువంటి ఫలితం లేదు అని చెప్పవచ్చు. వీటిని ఎక్కువగా వాడడం వల్ల చర్మం జిడ్డుగా మారడమే కాకుండా మరెన్నో కొత్త సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు ముఖాన్ని ఫేస్ వాష్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే చర్మం మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉంటుంది.

ఇకపోతే కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే తప్పకుండా అందంగా తయారవ్వచ్చు. ఇక ప్రతి ఒక్కరికి ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే వంటింటి చిట్కాలు ఉపయోగిస్తే చర్మం మరింత అందంగా మారిపోతుంది. మీ చర్మంపై ఓపెన్ ఫోర్స్ అధికంగా ఉంటే మాత్రం తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. ఇకపోతే ఓపెన్ పోర్స్ సమస్య ఉన్నవారు కొంచెం ముల్తానీమట్టి తీసుకుని అందులో టమోటో వేసి బాగా కలపాలి. ఇక దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Beauty Tips A great tip to get rid of pimples on the face
Beauty Tips A great tip to get rid of pimples on the face

ఇలా చేస్తే చాలా వరకు తగ్గిపోతాయి.ఇకపోతే మీరు ఎండకు కమిలిన చర్మాన్ని అందంగా మార్చుకోవాలి అంటే టమోటా రసంలో కొద్దిగా మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి . ఒక అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాదు ఈ ఫేస్ ప్యాక్ రాయడం వల్ల ట్యాన్ సమస్య కూడా తొలగిపోతుంది. ఇక చర్మం యొక్క రంగును మెరుగు పరుచుకోవాలి అంటే టమోటా గుజ్జు లో కాస్త తేనె కలిపి ముఖానికి మెడకు అప్లై చేయాలి ఆరిన తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి ఇలా చేస్తే మీ చర్మం మరింత అందంగా మెరుస్తుంది.