Tortoise Figurine : వాస్తు విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా పట్టింపు లేని వారికి ఎటువంటి సమస్య అనిపించదు.. కానీ వాస్తు పట్టింపు ఉన్నవారికి మాత్రం అడుగుపెట్టినా..అడుగు తీసినా ప్రతి విషయం లో కూడా ఆలోచిస్తారు . అంతే కాదు ఇంట్లో ఎప్పుడు.. ఎక్కడ .. ఏ వస్తువు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో.. అనే విషయాల గురించి ఎప్పుడూ ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా పాటించే వాళ్లు ఇంట్లో తాబేలు విగ్రహం లేదా తాబేలును పెంచుకోవడం కూడా శుభప్రదమని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తాబేలు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని కూడా విశ్వసిస్తున్నారు.
ఇక తాబేలు ను ఇంట్లో పెట్టడం వల్ల ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇలాంటి సమాచారం ప్రతి ఒక్కరికి అందాలి అంటే ఈ ఆర్టికల్ను వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా షేర్ చేయండి.వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లు పెడితే వాస్తు దోషాలు తొలగిపోతాయట. ఫెంగ్ షుయ్ శాస్త్రం ప్రకారం తాబేలు ఎలా అయితే తన అవయవాలను లోనికి లాక్కొని శత్రువుల నుంచి తనను తాను రక్షించుకుంటుందో.. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలును ఇంట్లో పెట్టినట్లయితే ఎలాంటి సమస్యల నుంచి అయినా మనల్ని తాబేలు రక్షిస్తుంది అని చెబుతారు. సంపద, ఆయుష్షు, సిరి సంపదలకు సంకేతంగా తాబేలు ను చెబుతారు.
ఉత్తర దిశలో తాబేలు ను నీటితో నింపిన పాత్రలో ఉంచి.. ఆ పాత్రను ఉత్తర దిశలో కానీ ఉత్తరం వైపున వున్న బెడ్రూంలో కానీ పెట్టడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.దిష్టి తొలగిపోయి ఆరోగ్యపరంగా అనుకూలంగా వుండడం తో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. స్పటిక తో తయారుచేసిన తాబేలును ఉంచినట్లయితే సంతోషం పెరుగుతుంది . తూర్పుదిశలో తాబేలు వుంచినట్లయితే అశాంతి, సమస్యలు కూడా తొలగిపోతాయి. తాబేలు కూర్మావతారం గా శ్రీ మహావిష్ణువును భావిస్తారు కాబట్టి ఈ అవతారంలో వచ్చిన మహావిష్ణువు ఎన్నో అద్భుతాలు చేస్తారు అని చాలామంది నమ్ముతారు. తాబేలును నీటిలో ఉంచి ఉత్తర దిక్కు వైపు ఉంచడం వల్ల బుధ గ్రహ దోషాలు తొలగిపోతాయి. పిల్లల్లో జ్ఞాన సంపద పెరుగుతుంది.