Apara Ekadashi : ఆర్థిక సంపద పెరగాలంటే అపర ఏకాదశి రోజు ఇలా చేయాల్సిందే..!!

Apara Ekadashi : అపర ఏకాదశి రోజున ఉపవాసముంటే అధిక సంపద పెరుగుతుంది అని చెబుతారు. ముఖ్యంగా ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం వల్ల పాపాలు తొలగిపోయి..బాధలు తొలగడమే కాకుండా దుఃఖాల నుండి కూడా మోక్షం లభిస్తుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్వర్గంలో స్థానం లభిస్తుందని చెబుతారు. ఏకాదశి రోజున విష్ణు మూర్తి వ్రతం యొక్క కథ వింటే అనుకోకుండా చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అపర ఏకాదశి ఏ రోజు వస్తుంది అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఏకాదశి తిధి మే 25వ తేదీ ఉదయం 10:32 గంటలకు మొదలై మే 26 ఉదయం 10:54 వరకు కొనసాగుతుంది.

ఇక పురాణాల విశ్వాసం ప్రకారం అపర ఏకాదశి మే 26 గురువారం రోజు రానుంది. ఇక ఆపర ఏకాదశి పూజలు మీ సౌలభ్యం ప్రకారం ఉదయం ఎపుడైనా ప్రారంభించవచ్చు. ఇక మరుసటి రోజు మే 27న ఉదయం 5:25 గంటల నుండి 8:10 ఉపవాస దీక్షను విరమించవచ్చు.ఉపవాసం రోజున వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. మే 26న అంటే గురువారం రోజు ఉదయం తలస్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తూ ఉపవాసం ఉండాలి. తర్వాత పూజా స్థలంలో ఒక పీఠం పై విష్ణువును ప్రతిష్టించాలి.

This is to be done on Apara Ekadashi to increase financial wealth
This is to be done on Apara Ekadashi to increase financial wealth

స్వామి వారి పూజ అనంతరం అపర ఏకాదశి ఉపవాస కథ పారాయణం చేయాలి. అప్పుడు విష్ణువుకి హారతి ఇచ్చి పూజ ముగించవచ్చు. పూజ తర్వాత బ్రాహ్మణుడికి బెల్లం , పసుపు, పసుపు బట్టలు, పండ్లు మొదలైన వాటిని దానంగా ఇవ్వాలి. రాత్రి సమయం నిద్రపోకుండా జాగరణ చేసి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి మళ్లీ పూజ చేసి ఉపవాసం విరమించాలి . ఇక మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే ఉపవాసం సమయంలో స్వామి వారికి కష్టాలు చెప్పుకుని పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం పొంది కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు. ఇక ఆర్థిక కష్టాలు కూడా తొలిగిపోయి సంపద పెరుగుతుంది.