Lord Maha Vishnu : పూల చెట్లు ఇంటికి అందాన్ని ఇస్తాయి.. మనం ఇంట్లో పెంచుకునే పూల మొక్కలలో సన్నజాజి పూల చెట్టు కూడా ఒకటి.. కొంతమందికి సన్నజాజి చెట్టు ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనే సందేహం కూడా కలుగుతుంది..!? ఈ చెట్టు పూలతో ఏ దేవుడికి పూజ చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..!సన్నజాజి చెట్టు ఇంట్లో పెంచుకోవడం ద్వారా ద్వారా పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది..
నెగిటివ్ ఎనర్జీ ని తరిమి కొడుతుంది. సన్నజాజి పూల వాసన పీల్చడం ద్వారా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం సన్నజాజి చెట్టు మీ ఇంట్లో పెంచుకోవడం చాలా మంచిది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం మన ఇంటి మీద ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. సన్నజాజి పూలతో సకల దేవతారాధన చేయొచ్చు.. సువాసన భరితమైన తెల్లని సన్నజాజులతో దైవారాధన చేస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి.
కార్తీక మాసంలో మహాశివుడికి సన్నజాజి పూలతో పూజ చేస్తే సొంత ఇల్లు కొనుక్కునే భాగ్యం కలుగుతుంది.తెలుపు రంగు పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అటువంటి సన్నజాజి పూలతో లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం సమర్పిస్తే లక్ష్మి ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువుకి తెల్లని సన్నజాజులు అత్యంత ప్రీతికరమైనవి. కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుకు సన్నజాజి పూలతో పూజ చేసిన వారికి వంద కపిల గోవులను దానం చేసిన ఉత్తమ ఫలం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.