Vastu Tips : మీరు వర్క్ చేసే టేబుల్ మీద వీటిని పెట్టుకున్నారు అంటే.. అవి మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి!! 

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం మీ టేబుల్ ని ఆఫీస్ లో లేదా స్టడీ రూమ్ లో గోడకు ఆనుకొని ఉంచాలి అని శాస్త్రం చెబుతోంది. అయితే టేబుల్ ఎల్లప్పుడూ కూడా తలుపు ముందు నేరుగా ఉండకూడదు . వాస్తు శాస్త్రం ప్రకారం మీరు పని చేసే టేబుల్ మీద వీటిని పెట్టుకున్నారు అంటే అవే మీకు అదృష్టం తీసుకొస్తాయి. ముఖ్యంగా ఆఫీసు డెస్క్ కి కుడివైపున అవసరమైన పుస్తకాలు, ఫైల్ లను ఉంచడం ఉత్తమంగా పరిగణిస్తారు .ఇలా చేస్తే ఆఫీస్ పనులు సులువుగా పూర్తవుతాయి. అలాగే సానుకూల శక్తి ఎల్లప్పుడూ మీ కార్యాలయంలోనే ఉంటుంది. ఆఫీస్ డెస్క్ వెనుక గోడపై మంచి పోస్టర్ లేదా చిత్రాన్ని ఉంచాలి.

If you keep these things on your work table .. you will become lucky..!
If you keep these things on your work table .. you will become lucky..!

స్టడీ టేబుల్ పైన ఎప్పుడు కూడా అద్దం పెట్టకూడదు చిన్న గాజు వస్తువు కూడా పెట్టడానికి నిషేధించండి. చాలామంది కొన్ని బెడ్ ల్యాంపులతో సహా కొన్ని ఆకర్షణీయమైన ఎలక్ట్రానిక్ వస్తువులు టేబుల్ పై పెడుతూ ఉంటారు . ఇది మంచిది కాదు. కత్తెర, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా టేబుల్ పై ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఏకాగ్రతకు భంగం కలిగి మరింత ఇబ్బంది పడతారు. అలాగే అనవసరమైన వస్తువులను కూడా ఉంచకూడదు.వ్యర్త కాగితాలు, కరపత్రాలు , పాత డైరీలు వంటివి కూడా వెంటనే తీసివేయాలి. అలాగే ముళ్ళ మొక్కలను కొంతమంది ఆకర్షణీత కోసం పెంచుకుంటూ ఉంటారు. వీటిని పెంచడం అసలు మంచిది కాదు. ముళ్ళ మొక్కలను టేబుల్ పై పెడితే ఈ మొక్కలు మీ మానసిక స్థితి పై చెడు ప్రభావం చూపుతాయి. సృజనాత్మకతను కూడా తగ్గించుకోవాలి.

ఇక మీరు మీ స్టడీ టేబుల్ పైన మీరు చదువుకునే పుస్తకాలతో పాటు వెదురు మొక్కలను కావాలంటే అలంకరణ కోసం పెంచుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రతికూల ప్రభావం మిమ్మల్ని దరిచేరదు.