Shani Dev : శనిదేవుడిని ఇలా పిలిస్తే ఐశ్వర్యం పెరుగుతుందట..!!

Shani Dev : లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఎన్నో పూజలు చేయాల్సి ఉంటుంది అని చెబుతూ ఉంటారు.. ఇదిలా వుండగా నిజానికి కొంతమంది అష్టమ శని, అర్ధాష్టమ శని , ఏలినాటి శని అని పేర్లు వింటే చాలు అదొక రకమైన భయంతో వణికి పోతూ ఉంటారు. కానీ శనీశ్వరుడు ప్రసాదించే వాటి గురించి తెలుసుకుంటే మాత్రం తప్పకుండా ఆయనని ఆరాధిస్తారు.. నిజానికి శని దేవుడు వ్యక్తి యొక్క కర్మ ఫలితాలను ఇస్తాడు కాబట్టి మనం చేసే పనులను బట్టి ఫలితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. సౌత్ ఇండియన్ తో పోల్చుకుంటే నార్త్ ఇండియన్ వారిలో శనిదేవుడిని ఎక్కువగా పూజించే వారు ఉన్నారు . ఇక ప్రతి శనివారం ఆలయాలలో శని దేవుడిని పూజించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.ఇళ్ళల్లో మాత్రం శని దేవునికి సంబంధించిన విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అస్సలు ఉండవు.

శని దేవుడిని ఇంట్లో పూజించకపోవడానికి కారణం ఏమిటి అంటే పౌరాణిక విశ్వాసాల ప్రకారం శని దేవుడి చూపు ఎవరిపై పడుతుందో వారు నీచ స్థితిలో ఉంటారని కూడా శాస్త్రంలో ఉందట . అందుకే ఆయన విగ్రహాలను ఎవరూ కూడా ఇంట్లో పెట్టుకోరు. శని దేవుడు చూపులు మీ పై పడితే.. శని దేవుడు మిమ్మల్ని పీడిస్తాడు.. కానీ వెళ్లిపోయేటప్పుడు అందుకు వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని , సంపదలను అందిస్తాడు. ఇక శనీశ్వరుడి అనుగ్రహం కోరుకోకపోతే ఆయన ఇచ్చే ఫలితాలను కూడా మనం పొందలేము. ఇక ఎవరైనా సరే శనీశ్వరుడు అనుగ్రహం పొందాలని ఆ తర్వాత వందరెట్లు యోగాన్ని పొందాలని భక్తిశ్రద్ధలతో కోరుకుంటారు అని ఇక్కడ శాస్త్రం చెబుతోంది.శని దేవుడిని పూజించే టప్పుడు శని శని అని పిలువ కూడదు ..

If Shani Dev is called like this, wealth will increase
If Shani Dev is called like this, wealth will increase

శనీశ్వర అని మాత్రమే పలకాలి అని.. ఎందుకంటే శనీశ్వర అని పలికేటప్పుడు ఈశ్వర అనే శబ్దం కూడా ధ్వని స్తుంది. ఎక్కడైతే ఈశ్వర అనే శబ్దం వినిపిస్తుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అని ఈశ్వరుడు అంటే పరమశివుడు కాబట్టి సంపద కచ్చితంగా పెరుగుతుంది అని లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కూడా ఎప్పుడైనా పారాయణంలో వచ్చినట్లయితే శనీశ్వర అని పలకాలి అని శాస్త్రం చెబుతోంది. శనీశ్వర అని పిలుస్తూ పూజ చేయడంవల్ల వెంకటేశ్వరుడు , శివుడిలా మనల్ని శని దేవుడు అనుగ్రహిస్తారు అని శాస్త్రం కూడా చెబుతోంది. ప్రతి ఒక్కరికి శనీశ్వరుడి గురించి తెలియాలి అంటే ఇలాంటి ఆర్టికల్ వాట్సప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఇతరులకు షేర్ చేయండి.