చెడు దృష్టి పోవాలంటే శని అమావాస్య రోజు ఇలా చేయండి..!!

మన హిందూ ధర్మం లో ఉండే తెలుగు క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య ప్రతి కృష్ణపక్షం చివరి తేదీన రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సారి మాత్రం అమావాస్య శనివారం రావడం విశేషం. ఈ వైశాఖ మాసంలో శనివారం రోజున అమావాస్య కావడంతో దీనికి ప్రత్యేకత చాలా పెరిగిపోయింది.. అయితే ఈ సారి మాత్రం అమావాస్య ఏప్రిల్ 30 వ తేదీన శనివారం కావడంతో దీనిని శని అమావాస్య గా పిలవడం జరుగుతోంది.. అయితే ఈ శని అమావాస్య రోజున జ్యోతిష్యం ప్రకారం కొన్ని నివారణ చర్యలు చేపట్టడం మంచిదని.. కొంతమంది పండితులు తెలియజేస్తున్నారు. తద్వారా శని దేవుని అనుగ్రహం పొందే అవకాశం ఎక్కువగా ఉన్నదట.ఇక అంతే కాకుండా ఎన్నో రకాల దోషాల నుండి కూడా మనం విముక్తి పొందవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు.

Advertisement

శని అమావాస్య రోజున ప్రజలు శనిదేవుడిని ఆదరించడానికి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శని దోషం పోవాలని కొంతమంది ప్రత్యేక పూజలతో పాటు దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చే అమావాస్య రోజున కొన్ని నివారణ చర్యలు పాటిస్తే అనేక చెడు ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు.ముందుగా శని అమావాస్య ఏప్రిల్ 29 రాత్రి 12:57 గంటల కు ప్రారంభమవుతుంది.. ఇక ఇది మరుసటి రోజున అంటే ఏప్రిల్ 30 వ తేదీన మధ్యాహ్నం 1:57 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజుని వైశాఖ మాసం శని అమావాస్య గా జరుపుకుంటూ ఉంటారు. శని అమావాస్య నాడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement
Do this on the day of the new moon on Saturday to get rid of bad vision
Do this on the day of the new moon on Saturday to get rid of Bad Vision

1).శని దేవుడికి కోపం, ఇతరుల దోషాలు, దుష్ప్రభావాల నుంచి మనం బయట పడాలి అనుకుంటే శని అమావాస్య రోజున ఉదయం లేవగానే స్నానం చేసి రావి చెట్టు వద్దకు వెళ్లి నల్లనువ్వులు, మట్టి దీపం, ఆవాల నూనెతో వెళ్లి అక్కడ పూజ చేయడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.

2). శని దేవుని అనుగ్రహం పొందితే ఎటువంటి కష్టం కూడా రాదు.. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఆరాధన.. రాబోయే శని అమావాస్య రోజున ఆలయానికి వెళ్లి శని దేవుడికి నల్ల నువ్వులు సమర్పించి.. అక్కడ శనిదేవుని మంత్రాన్ని పఠనం చేసినట్లయితే.. విముక్తి పొందవచ్చు.

4). శని అమావాస్య రోజున ఏదైనా గుడికి వెళ్లి అక్కడ బెల్లం దానం చేసినట్లు అయితే ఎటువంటి దరిద్రమైనా వెళ్లి పోతుందట.

Advertisement