Samantha : డబ్బులు లేక సమంత ఆ సినిమాలో ఐటం సాంగ్ చేస్తుందా.!? మరెందుకంటే.!?

Samantha :  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఆరోగ్య పరిస్థితి క్షీణించి పోతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె టీమ్ స్పందించింది. అలాగే సమంత ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు డైరెక్టర్ తెలిపారు. దాంతో సమంత మళ్ళీ ఐటెం సాంగ్ లో నటిస్తుందిని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Samantha item song on Mahesh Babu movie
Samantha item song on Mahesh Babu movie

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆ తరువాత మహేష్ తల్లి చనిపోవడంతో ఆ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఆ బాధలో నుంచి తేరుకునే లోపే సూపర్ స్టార్ కృష్ణ ఈ లోకాలను విడిచి అనంతలోకాలకు చేరుకున్నారు. త్వరలోనే మహేష్ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ అని ఆ ఐటెం సాంగ్ లో రష్మిక మందన చేస్తోందని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో రష్మిక చేయడం లేదని.ఆ స్పెషల్ ఐటమ్ సాంగ్ లో సమంత చేస్తుందని ఓ టాక్ వినిపిస్తోంది.. ఆల్రెడీ పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటమ్స్ అండ్ ఇది ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాంటి సమంత మళ్ళీ ఐటెం సాంగ్ చేస్తుందంటే.. ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ప్రస్తుతం సమంత ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అలాంటి సమయంలో ఐటెం సాంగ్ చేస్తుందని తెలియడంతో.. సమంత డబ్బులు లేక ఐటమ్ సాంగ్ చేస్తుందా లేకపోతే ఎందుకు చేస్తుంది అంటూ రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే సినిమా చేసిన దానితో సమానంగా సమంతకి ఐటమ్ సాంగ్ లో రెమ్యూనరేషన్ వస్తుందంట.. అందుకే సినిమాల కంటే ఐటమ్స్ సాంగ్ లో చేస్తే రెమ్యూనరేషన్ తో పాటు ఫేమ్ కూడా వస్తుందని సమంత ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజమన్నది అనేది అధికారిక ప్రకటన వస్తే గాని తెలియదు.