Ravi Teja : హైప‌ర్ ఆదికి గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ‌… అంత త‌ప్పు ఏం చేశాడ‌బ్బా…!

Ravi Teja: ఉర్రూతలూగించే స్టెప్పులతో ప్రముఖ డ్యాన్స్‌ షో ‘ఢీ 14’ ప్రతివారం ప్రేక్షకులను కనువిందు చేస్తూనే ఉంటున్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిదే. అయితే ఈ డ్యాన్స్ షో ఫైన‌ల్ ఎపిసోడ్ డిసెంబ‌ర్ 4న ప్ర‌సారం కానుండ‌గా, ఫినాలే ఎపిసోడ్‌కి ర‌వితేజ ముఖ్య అతిథిగా వ‌చ్చారు. మాసివ్ స్టైల్‌లో ఆయ‌న చేసిన ర‌చ్చ మాములుగా లేదు. రవితేజ తన కామెడీతో పాటు డ్యాన్స్‌తో కూడా అదరగొట్టారు. ఇక హైప‌ర్ ఆదికి ఏకంగా నువ్వు అయిపోయావు, అస్స‌లు ఈ డ్యాన్స్ షోలో నీకేం ప‌ని అంటూ అత‌నికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. రీసెంట్‌గా షోకి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇది ఆస‌క్తి రేపుతుంది.

ravi-teja-sweet-warning-to-hyper-aadi
ravi-teja-sweet-warning-to-hyper-aadi

అద‌రగొట్టేశాడు..

మాస్ మహారాజ్ రవితేజ.. అంటే టాలీవుడ్ లో సెపరేట్ బ్రాండ్ కాగా, ఆయన‌ మాస్ డైలాగ్స్.. మాస్ యాక్షన్ తో పాటు.. ఊరమాస్ యాటిట్యూడ్ తో తనకంటూ.. స్పెషల్ ఇమేజ్ అందుకున్నాడు. రవితేజ చాలా వరకు కాంట్రావర్సీలకు దూరంగానే ఉంటారు, అయితే ఒక్కోసారి కాంట్రవర్సీలే ఆయన్ను వెతుక్కుంటూ వస్తుంటాయి. కెరీర్ బిగినింగ్ నుంచి స్టార్ అయినప్పటి వరకూ.. స్టార్ స్టేటస్ ను అనుభవిస్తూన్నా కూడా .. వివాదాలు మాత్రం ర‌వితేజ‌ని మాత్ర వ‌ద‌ల‌డం లేదు.

అయితే ర‌వితేజ మీడియాకి చాలా దూరంగా ఉంటారు. షోస్‌లోను పెద్ద‌గా క‌నిపించ‌రు. అయితే తొలిసారి ఢీ షోలో సందడి చేశాడు రవితేజ. ఈక్రమంలోనే హైపర్ ఆదికి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఫంచ్ లు విసురుతూ తెగ సంద‌డి చేశాడు. హైపర్ ఆది పై నాన్ స్టాప్ గా సెటైర్లు పేల్చి వినోదం పంచాడు..ఆది మాట్లాడుతూ… మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్న నాకు మీతో ధమాకా మూవీలో నటించే ఛాన్స్ దక్కింది’ అని హైపర్ ఆది అంటుంటే… నేను కూడా ఎప్పటి నుండో నీతో చేద్దాం అనుకుంటున్నాను. అన్నాడు ర‌వితేజ‌.అంతేకాదు నీకుందిలే అంటూ స‌ర‌దాగా పంచ్ వేశాడు మాస్ రాజా. షోకి ఏ సెలబ్రిటీ వచ్చినా.. వారిపై వరుసగా భారీ పంచులు విసిరే ఆదికి మాస్ రాజా చుక్క‌లు చూపించాడు.