Pragathi : బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న ప్రగతి ఆంటీ .. కుర్రాళ్ళకి పండగే పండగ !

Pragathi : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై ప‌సందైన వినోదం పంచుతూ దూసుకుపోతున్న షో బిగ్ బాస్. ప్ర‌స్తుతం సీజ‌న్ 6 జ‌రుగుతుండ‌గా, ఈ సారి హౌజ్‌లోకి 21 మంది కంటెస్టెంట్స్ వ‌చ్చారు. అయితే ఈ సారి కొంత పేరు ఉన్న సెలబ్రిటీలను తీసుకురాకుండా ఎవరెవరో కొత్తవారిని తీసుకువచ్చారు అనే విధంగా ట్రోల్ జ‌రుగుతూ ఉంది. ఈసారి బిగ్ బాస్ నిలదొక్కుకోవడం కూడా కష్టమే అని మధ్యలోనే ఆగిపోతుంది అనే విధంగా కూడా విమ‌ర్శ‌లు చేశారు. అయితే షోని ట్రాక్‌లోకి తీసుకురావాలి అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ త‌ప్ప‌ని స‌రి అని అంద‌రు భావిస్తున్నారు. బిగ్ బాస్ కు మొదటి నుంచి కూడా ఇదే తరహా ఆలోచన ఉంది.

అందుకే ముందుగానే ప్లానింగ్ చేసుకొని మరి ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం స్టార్ సెలబ్రిటీని సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ సారి కూడా అలాంటి ప్లానింగ్ ఉంద‌ని, బాబా భాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం. అయితే, కేవలం బాబా భాస్కర్ మాత్రమే కాదు, బాబాభాస్కర్ తో పాటుగా శ్రీముఖి కూడా హౌస్ లోకి వెళ్లబోతోంది. కానీ, శ్రీముఖి వైల్డ్ కార్ట్ ఎంట్రీ మాత్రం కాద‌ని ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు చెప్పుకొస్తున్నారు. ఆ మ‌ధ్య సుడిగాలి సుధీర్- ర‌ష్మీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారంటూ ప్ర‌చారం చేశారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు ప్ర‌గ‌తి ఆంటీ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని చెబుతున్నారు.

Pragathi wild card entry into bigg boss
Pragathi wild card entry into bigg boss

Pragathi : మాంచి కిక్ దొర‌క‌డం ఖాయం..

వెండితెర క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి.. తల్లి, అక్క, వదిన పాత్రలతో ప్రేక్షకులను ఎంత‌గానో అల‌రించింది.. తనదైన నటనతో తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ కూడా ఏర్ప‌ర‌చుకుంది. ఈ అమ్మ‌డు జిమ్ముల్లో కుస్తీ పడుతూ తన శరీర సౌష్టవాన్ని కాపాడుకోవడం చేస్తూ ఉంటుంది. అలానే జిమ్ వీడియోల‌ని కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. అలానే ప‌లు సూప‌ర్ హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ లు చేస్తున్న వీడియోల‌ని కూడా షేర్ చేస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌గ‌తికి పిచ్చి క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాల‌ని భావిస్తున్న బిగ్ బాస్ యాజ‌మాన్యం ప్ర‌గ‌తిని హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపి అస‌లైన గేమ్ ఆడించేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇదే నిజ‌మైతే ప్ర‌గ‌తి కుర్రాళ్ల‌కి కిక్కెక్కిచ్చ‌డం ఖాయం. దీనిపై త్వ‌ర‌లో క్లారిటీ రానుంది.