Namrata Shirodkar : తన భర్త విషయంలో అసలు విషయం చెప్పేసిన నమ్రత శిరోద్కర్..!

Namrata Shirodkar : :  ప్రిన్స్ మహేష్ బాబు చేసిన సర్కారు వారి పాట సినిమాతో కలిపి ఇప్పటివరకు తన కెరీర్లో మొత్తం 27 సినిమాలను చేశారు.. మహేష్ సెలెక్టివ్ కథలను, డైరెక్టర్లను ఎంచుకోవడంలో జాగ్రత్తగానే ఉంటారని చెప్పవచ్చు.. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరొక సినిమా చేస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత కి మహేష్ చేసిన సినిమాల్లో బాగా ఇష్టమైన మూవీ అంటే ఏంటో అని అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పిన సమాధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Namrata Shirodkar who told the truth about her husband
Namrata Shirodkar who told the truth about her husband

బాలనటుడి గానే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అందరినీ మంత్రముగ్ధులుగా చేశాడు ప్రిన్స్ మహేష్ బాబు.. నటశేఖరుడైన కృష్ణ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తనదైన శైలీ లో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.. బాల నటుడిగా ఎనిమిదికి పైగా సినిమాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు.. కథానాయకుడిగా 25 సినిమాలకు పైగా చిత్రాలలో నటించారు. మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా “రాజకుమారుడు” సినిమాతోనే ఉత్తమ నంది అవార్డు పురస్కారాన్ని స్వీకరించారు.. 2003 లో డైరెక్టర్ తేజ కాంబినేషన్లో వచ్చిన “నిజం “సినిమాకి కూడా ఉత్తమ నంది అవార్డుని మహేష్ అందుకున్నారు. 2005లో వచ్చిన అతడు, 2011లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా మహేష్ బాబు నటనకు ఉత్తమ నంది పురస్కారాలను సొంతం చేసుకున్నాడు. సినీనటి నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నారు..

మహేష్ బాబు భార్య నమ్రత నమ్మక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.. మరొక గంటలో ప్రపంచం అంతమైపోతుంది అంటే.. మహేష్ బాబు తన చివరి క్షణాలను పిల్లలతో గడుపుతారని నమ్రత చెప్పారు.. మహేష్ బాబు సినిమాలు అన్నిటిలోకల్లా నాకు పోకిరి సినిమా అంటే చాలా ఇష్టమని నమ్రత చెప్పారు.. పోకిరి సినిమా 2006 లో విడుదలై ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది..

ఈ సినిమాను డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చింది.. ఈ పోకిరి సినిమా స్టోరీని తన తొలి చిత్రం అయినా బద్రి చిత్రీకరిస్తున్న సమయంలోనే రాసుకున్నారు.. పోకిరి కి ఆయన మొదట్లో పెట్టుకున్న పేరు ఉత్తం సింగ్, ఆ తరువాత సూర్యనారాయణ టైటిల్ ని అనుకున్నట్లు తెలుస్తుంది.. ఇలా చివరకు నవంబర్ 3 2004వ సంవత్సరంలో హైదరాబాద్ తాజ్ హోటల్లో మహేష్ బాబుకు పూరి జగన్నాథ్ కథ చెప్పారు.. మహేష్ బాబుకు కథ చాలా బాగా నచ్చడంతో తర్వాత సంవత్సరంలో మొదలు పెడదామని మహేష్ బాబు అంగీకరించారు..