Deepthi Sunaina : దీప్తి సునయనకు పబ్లిక్ గా ముద్దు పెట్టేసాడు.. ఈ ఫోటో చూస్తే షణ్ముఖ్ జస్వంత్ తట్టుకోగలడా..?

Deepthi Sunaina: యూట్యూబ్ స్టార్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇద్దరు మొదటి నుంచి యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఎదిగారు. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యారు. ముందు నుంచి కలిసే ఉండడంతో ఇద్దరి మధ్య స్నేహం ఉంది.మ్ ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. బిగ్ బాస్ సాక్షిగా ఒకరి మీద ఉన్న ప్రేమను మరొకరు బాహాటంగానే చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు కలిసి లేరు.. కొన్ని కారణాల వల్ల విడిపోయారు. తాజాగా దీప్తి సురాయనకు ఒకరు ముద్దు పెడుతున్న వీడియో బయటికి వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

యూట్యూబ్లో చూడ ముచ్చటైన జంటగా ఉండే వాళ్ళు దీప్తి సునయన, షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు కలిసి చేసిన వీడియోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేది. అయితే బిగ్ బాస్ గత సీజన్లో షణ్ముఖ్ ఎక్కువగా సిరితో క్లోజ్ గా ఉండడం.. అతని పర్సనల్ లైఫ్ పై చాలా ప్రభావం చూపించింది. అప్పటి వరకు కలిసిమెలిసి ఉన్న దీప్తి, షణ్ముఖ్ కేవలం సిరి కారణంగానే విడిపోయారనే ప్రచారం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరిగింది. వాళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం నేను కాదు అని సిరి ఎన్ని సార్లు చెప్పినా కూడా వాళ్ళ అభిమానులు మాత్రం ఒప్పుకోవడం లేదు. కేవలం నీ కారణంగానే చిలుక గోరింక లాంటి దీప్తి, షణ్ముఖ్ దూరం అయిపోయారు అంటూ ఇప్పటికీ సిరిపై మండి పడుతూనే ఉంటారు ఫ్యాన్స్. 2022 జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా తన ప్రియుడు షన్నుకు షాక్ ఇచ్చింది దీప్తి.

Deepthi Sunaina did this mistake
Deepthi Sunaina did this mistake

Deepthi Sunaina : అసలు దీప్తికి ముద్దు పెట్టింది ఎవరు..?

కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా తాము ఇద్దరం విడిపోతున్నట్టు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ తన కెరీర్ పై ఫోకస్ చేశాడు. ఇప్పటికే వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రాడు.. ఇకపై సినిమాలు చేయాలని ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఈ మధ్య ఒక ఈవెంట్లో దీప్తి, షణ్ను ఒకే దగ్గర కలిసి కనిపించారు. అప్పుడు దీప్తి అతడి గురించి ఏం మాట్లాడలేదు.. కానీ షణ్ముఖ్ మాత్రం దీప్తి గురించి చాలా బాగా చెప్పాడు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో దీప్తి సునైనా పోస్ట్ చేసిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అందులో తన అల్లుడుతో ఆడుకుంటూ ఉంది.. దీప్తి ఆ బుడ్డోడు దీప్తి సునయనకు ముద్దు పెట్టాడు. ఈ వీడియో బాగా ట్రెండింగ్ అవుతుంది. అయ్యో పాపం ఎవరు పడితే వాళ్ళు దీప్తికి ముద్దులు పెడుతున్నారు.. వీటిని చూస్తే షణ్ముఖ్ ఏమనుకుంటాడు అంటూ సరదాగా కామెంట్ కూడా చేస్తున్నారు..