Allu Arjun : అంద‌రు హీరోలు కుళ్లుకునేలా చేసిన అల్లు అర్జున్.. తొలి సౌత్ ఇండియ‌న్ యాక్ట‌ర్ ఇత‌నే..!

Allu Arjun : చిరంజీవి స్పూర్తితో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నాడు. త‌న ప్ర‌తి సినిమాలో వైవిధ్యం చూపిస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు. చివ‌రిగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం అవార్డులను సైతం కొల్లగొడుతోంది. ఇప్పటికే మ్యూజిక్ పరంగా ‘మిర్చి మ్యూజిక్ అవార్డ్స్’ను, ఆయా కేటగిరిల్లో ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ ను కూడా అందుకుని ఈ చిత్రం స‌త్తా చాటింది. తాజాగా ఈ చిత్రానికి గాను ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు.

Allu Arjun :  త‌గ్గేదే లే..

కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డును స్వీకరిస్తూ అల్లు అర్జున్.. భారతీయ సినిమా, భారతదేశం ఎన్నటికీ తలవంచదు అంటూ తన పుష్ప డైలాగ్ ను కాస్త మార్చి చెప్పి అంద‌రిని ఉత్సాహ ప‌రిచారు . “నేను సినీ పరిశ్రమలో 20 ఏళ్లుగా ఉన్నాను, దక్షిణాదిలో ఎన్నో అవార్డులు అందుకున్నా ఉత్తరాది నుంచి అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకమంటూ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడారు బ‌న్నీ. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సౌత్ హీరో ఈ అవార్డ్ ద‌క్కించుకోక‌పోవ‌డ‌తో బ‌న్నీ అభిమానులు నానా ర‌చ్చ చేస్తున్నారు.

allu-arjun-reciveed-indian-of-the-year-award
allu-arjun-reciveed-indian-of-the-year-award

మా హీరో స‌త్తా ఏంటో ఇప్పుడు తెలిసిందా అంటూ ఇత‌ర హీరోల అభిమానుల‌కి స‌వాల్ విసురుతున్నారు. కొంద‌రు హీరోలు త‌మ హీరోని చూసి కుళ్లుకుంటున్నారంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప సూపర్ హిట్ కావడం తర్వాత కేజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు నార్త్ ఇండియాలో విడుద‌లై మంచి విజ‌యం సాధించాయి. ఇప్పుడు పుష్ప 2 చిత్రంకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సెకండ్ పార్ట్‌తో బ‌న్నీ క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.