Intinti Gruhalakshmi 08 August Today Episode : సామ్రాట్ తో పాటు టూర్ వెళ్లడానికి తులసి ఒప్పుకుందా.!? నందు హార్ట్ బ్రేక్..

Intinti Gruhalakshmi 08 August Today Episode : తులసి వాళ్ళ ఇంటికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తో సహా వస్తాడు.. సామ్రాట్ ఇందిరెక్టు గా మీ బాబాయి గారు ఏం తప్పు చేశారు.. అసలు నేనే తప్పు చేశాను క్షమించండి అని తులసి అంటుంది గతం అనేది కొందరికి మధురానుభూతులను అందిస్తుంది కానీ మనలాంటి వాళ్ళకి చేదు అనుభవాలు ఎదురవుతాయి అని సామ్రాట్ అంటాడు.. దాన్ని మర్చిపోవలని ట్రై చేస్తున్నాను.. క్షమించండి అని తులసి చెబుతుంది.. మీకు సంబంధించిన ఒక వస్తువు మీరు మా ఇంట్లో మర్చిపోయారు.. అది మీరు తీసుకుంటే మీకు నా మీద కోపం లేదని నేను నమ్ముతాను అని సామ్రాట్ తన కార్ లో ఉన్న వీణ తీసుకువస్తాడు.. మీరు తీసుకోలేదు అంటే కోపం తగ్గలేదన్నట్టే అని సామ్రాట్ అంటుండగా తులసి తీసుకుంటుంది.. మీటింగ్ ఉందని తులసి గారికి తెలుసా అని సామ్రాట్ నందు నీ అడుగుతాడు.. మీటింగ్ 10’0 క్లాక్ అని చెప్పవా.. టైం సెన్స్ ఉండాలి అని అంటుంది లాస్య.. అప్పుడే తులసి వచ్చి సారీ అండి లేట్ అయింది..

మనిషికి మంచితనం ఎంత అవసరమో అలాగే మనం చేస్తున్న పని మీద కూడా అంతే శ్రద్ధ ఉండాలి.. మీకు ఏ పని అయినా టైం లేట్ అయిందో నాకు తెలియదు కానీ.. మీ వల్ల ఇలా ఇంకొకరిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు అని సామ్రాట్ అంటాడు. నాకు అది నచ్చదు.. వచ్చి కూర్చోండి అని సామ్రాట్ అంటాడు.. మీ వల్ల మా వర్క్స్ అన్నీ ఆగిపోయాయి.. ఇట్స్ వెరీ బాడ్ అని నందు అంటాడు.. నేను ఆడదాన్ని ఇంట్లో పనులన్నీ చెక్కపెట్టుకొని టైం కి వచ్చేసాను కదా అని లాస్య అంటుంది.. చూడండి ఇక్కడ బాస్ ను నేను.. తులసి బిజినెస్ పార్ట్నర్ ని నేను అడిగే హక్కు నాకు మాత్రమే ఉంటుంది.. మీకు లేదు అర్థమైందా.. తులసిని హర్ట్ చేసే రైట్స్ మీకు లేవు అని సామ్రాట్ అంటాడు.. సారీ చెప్పాల్సింది నాకు కాదు తులసి గారికి అని అంటాడు సామ్రాట్.. హ్మ్మ్ చెప్పండి అనగానే.. నందు లాస్య సారీ చెబుతారు ఇంతకీ నీకు ఎందుకు లేట్ అయింది అమ్మ అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అడగగానే ఇంట్లో మా అత్తయ్య మామయ్య ఇద్దరు పేషెంట్స్ వాళ్లకి నా వంట తప్ప ఇంకా ఎవరి వంట సెట్ అవ్వదు.

Intinti Gruhalakshmi Serial 08 August 2022 Today Full Episode
Intinti Gruhalakshmi Serial 08 August 2022 Today Full Episode

అప్పటికి ఈ రోజు మీటింగ్ ఉందని పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకున్నాను ఇంకోసారి ఇలా కాకుండా చూసుకుంటానని తులసి అనగానే ఈ విషయంలో నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అమ్మ బాధ్యత తీసుకోవాల్సిన కొడితే వదిలేసిన కూడా.. అమ్మానాన్నలను గాలికి వదిలేసాడు నీ జీవితమే నీకు బరువైన కూడా వాళ్ళని బాధ్యతగా చూసుకుంటున్నావని.. వాళ్ల బ్రతుకులు అనాధ శరణాలయం పాలు కాకుండా చక్కగా చూసుకుంటున్నావు అని తులసిని అంబరం ఎక్కిస్తాడు..అయినా వాళ్ళ అమ్మానాన్నలని చూసుకోకుండా ఎందుకు ఉంటాడు అని లాస్య అనగా ఉంటారు కొంతమంది పెళ్ళాం చేతిలో కీళ్లు బొమ్మలు లాగా అయినా తులసి గారు గ్రేట్ అని సామ్రాట్ అనగానే నువ్వేమంటావు నందు అని అంటాడు.. అవును సార్ అని అంటాడు నందు.. సార్ మీకు నెక్స్ట్ మీటింగ్ టైం అవుతుంది స్టార్ట్ చెద్దమా అని లాస్య అంటుంది..

నందు తన ప్లాన్ ను వివరిస్తాడు.. మీ మనసు మీ ఆలోచనలను ఇప్పుడు నందు తెలుసుకుంటాడు..నందు రేపు నువ్వు మ్యూజిక్ స్కూల్ ప్లాన్స్ గురించి చర్చించడానికి వైజాగ్ వెళ్లాలి అని అంటాడు.. లేదు సార్ రేపు ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తుకున్నాను అని నందు అంటాడు.. అయితే నీతో పాటు తులసిని తీసుకెళ్ళు అని సామ్రాట్ వాళ్ల బాబాయి అంటాడు.. అవును బాబాయి నేను అదే అనుకున్నాను అని సామ్రాట్ అంటాడు.. అవును తులసి గారు మీరు కూడా నాతో పాటు వైజాగ్ రండి.. అక్కడికి వస్తే మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అని సామ్రాట్ అంటాడు.. నేను ఎందుకు సార్ రాను అని తులసి అంటుంది.. ఒకసారి వస్తే మీకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి అని అంటుండగా.. సామ్రాట్ వాళ్ళ బాబాయ్ నేను మీ మామయ్య గారితో మాట్లాడుతాను అని అంటాడు.. లేదు సార్ నేను మాట్లాడి చెబుతాను అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..