Best Jio Plans : జియో నుంచి ఇంకో బెస్ట్ ప్లాన్.. తక్కువ ధరకే 84 రోజులు వ్యాలిడిటీతో..!!

Best Jio Plans : రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్న టెలికాం నెట్వర్క్ ఏది అంటే ముందుగా రిలయన్స్ జియో అని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా తమ కష్టమర్ లను ఆకర్షించడానికి తక్కువ ధరకే 84 రోజులపాటు వ్యాలిడిటీని అందించే సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ను తీసుకొచ్చింది జియో. ఇకపోతే జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ధర ఎంత? వివరాలు ఎలా ఉన్నాయి? అని ప్రతి విషయం చదివి తెలుసుకుందాం.

రూ.395 రీఛార్జ్ ప్లాన్ : మిగతా టెలికామ్ కంపెనీలతో పోల్చుకుంటే అత్యంత తక్కువ ధరకే అంటే కేవలం 395 రూపాయలకి 84 రోజులపాటు వ్యాలిడిటీ అందించే బెస్ట్ ప్లాన్ ని జియో అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా మీరు మొత్తం 84 రోజులకు గానూ 6 జీబీ డేటాను పొందవచ్చు. అలాగే 1000 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఇక అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం కూడా లభిస్తుంది. ముఖ్యంగా డేటా తక్కువగా ఉపయోగించే వారికి ఇది ఒక బెస్ట్ ప్లాన్ ని చెప్పవచ్చు.

Another best plan from Jio at low price with 84 days validity
Another best plan from Jio at low price with 84 days validity

రూ.719 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్ ద్వారా మీకు 84 రోజులపాటు పూర్తి వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే ప్రతిరోజు 2gb డేటా పొందే అవకాశం ఉంటుంది . ఇక నిత్యం 100 ఉచిత ఎస్ఎంఎస్లను పొందడంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఇక రిలయన్స్ జియో కి సంబంధించిన అన్ని యాప్ లను మీరు ఉచితంగా సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు.

రూ.666 రీఛార్జి ప్లాన్ : 84 రోజులపాటు ఈ ప్లాన్ మీకు వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ఇకపోతే ఈ ప్లాన్ ద్వారా మీరు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఇక డేటా విషయానికి వస్తే ప్రతిరోజూ 1.5జిబి డేటా చొప్పున లభిస్తుంది. ఇక అంతేకాదు మొత్తం 84 రోజులకు గానూ 126 జీబీ డేటా మీరు పొందవచ్చు.

రూ.296 రీఛార్జ్ ప్లాన్ : 30 రోజులపాటు వ్యాలిడిటీతో ఈ ప్లాన్ ను అందిస్తోంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఆప్షన్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు 30 రోజులకుగాను 25 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఇక రిలయన్స్ జియో అందిస్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తో వాయిస్ కాలింగ్ పొందవచ్చు. ముఖ్యంగా డేటా వినియోగం ఎక్కువగా అవసరం లేని వారికి ఈ రీఛార్జ్ ప్లాన్స్ బెస్ట్ ప్లాన్స్ అని చెప్పవచ్చు.