UPI Apps : ఫోన్ పే , గూగుల్ పే , పేటీఎమ్ వాడే వారికి అలర్ట్.. ఈ చార్జీలు కూడా తెలుసుకోండి..!

UPI Apps : అంతా డిజిటలైజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్క రూపాయి చెల్లించాలన్నా ఎక్కువగా ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ యాప్ల మీద ఆధారపడుతున్నారు. ఇక పెద్దపెద్ద లావాదేవీల దగ్గర్నుంచి చిన్న చిన్న లావాదేవీలు , బయట కూరగాయలు అమ్ముకునే వారి దగ్గర కూడా మనం ఫోన్ పే, గూగుల్ పే లాంటివి చూస్తూనే ఉన్నాం. ఇకపోతే రీఛార్జ్ కూడా వీటి ద్వారానే చేసుకుంటూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పుడు చెప్పే అసలు విషయం ఏమిటంటే మీరు కూడా ఫోన్ పే లేదా గూగుల్ పే ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫోన్ పే, గూగుల్ పే, పే టీ ఎమ్ వంటి డిజిటల్ యాప్లు.. యూజర్ల నుంచి సర్ చార్జి , ప్లాట్ఫామ్ ఫీజు, కన్వీనియన్స్ ఫీజు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నాయి.

ముఖ్యంగా మొబైల్ రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ వాటిపై ఈ చార్జీలు తీసుకుంటూ ఉండడం గమనార్హం.. అయితే ఇప్పటివరకు మీరు ఈ విషయాన్ని గమనించక పోయి ఉండవచ్చు. కానీ ఇకపై బిల్ పేమెంట్ లేదా రీచార్జ్ చేసినప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని గమనించవచ్చు. ఇక ప్రతి మొబైల్ రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ చేసేటప్పుడు కచ్చితంగా 2 రూపాయల వరకు అదనంగా చార్జీలు పడుతున్నాయి. మీరు ఫోన్ పే ద్వారా మొబైల్ కి రీఛార్జ్ చేసుకుంటే ప్లాట్ఫామ్ ఛార్జ్ ల రూపంలో 2 రూపాయల వరకు చెల్లించాలి . ఇక ఏ పేమెంట్ మోడ్ ద్వారా అయినా సరే లావాదేవీలు నిర్వహించినా.. ఈ ఫీజు పడుతుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా యూపీఐ, క్రెడిట్ కార్డ్ , ఫోన్ వాలెట్, డెబిట్ కార్డ్ ఇలా మీరు ఎలా డబ్బులు చెల్లించినా సరే ప్లాట్ ఫామ్ మీద మాత్రం ఖచ్చితంగా పడుతుంది.

UPI Apps Phone Pay, Google Pay, Paytm users Know these charges too
UPI Apps Phone Pay, Google Pay, Paytm users Know these charges too

ఇక పేటీఎం విషయానికి వస్తే..ఏకంగా రూ.1 నుంచి రూ.6 రూపాయల వరకు వసూలు చేస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరైనా పేటీఎం ఉపయోగించి ఈ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే దానిపై సర్ చార్జి రూపంలో పేటీఎం అదనంగా 6 రూపాయల వరకు చార్జ్ చేస్తూ ఉండడం అదనపు భారం అని కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, పేటీఎం వాలెట్ , పేటియం పోస్ట్ పెయిడ్, యూపీఐ, డెబిట్ కార్డ్ ఇలా ఏ మార్గంలో రీచార్జ్ చేసుకున్న సరే తప్పకుండా ఎక్స్ట్రా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే మీరు ఏదైనా రీఛార్జ్ లేదా బిల్ పేమెంట్ వ్యవహారాలు జరిపేటప్పుడు ఏ యాప్ లో తక్కువ ఛార్జ్ వసూల్ చేస్తున్నారో తెలుసుకొని అందులో రీఛార్జ్ చేసుకుంటే కొంత వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు.