Financially : ఆర్థికంగా ఎదగాలంటే ఇలా చేయాల్సిందే..!!

Financially : వాస్తు శాస్త్రం ప్రకారం దిశలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పెట్టుకునే వస్తువులు మనిషి జీవితంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మనం ఇంట్లో దిశలలో పెట్టుకునే వస్తువుల స్థానం బట్టి సానుకూల, ప్రతికూల శక్తి రెండూ కూడా వెలువడుతాయి. ఇక ఆ ఇంట్లో నివసించే వ్యక్తులపై మంచి, చెడు ప్రభావం కూడా చూపుతుంది. ఇక కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ప్రతికూల వాతావరణం, కలహాలు, విభిన్న వాతావరణం, ఇంటి వెనక వాస్తు దోషాలు కూడా కుటుంబ ఆర్థిక నష్టానికి కారణం కావచ్చు. ముఖ్యంగా చిన్నచిన్న వాస్తు చిట్కాలు పాటించినట్లయితే వాస్తు దోషం కారణంగా వచ్చే ఆర్థిక, శారీరక సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇక మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా వాస్తుదోషంతో ఇబ్బంది పడుతున్నట్లు అయితే వారికి ఈ ఆర్టికల్ ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి. ఎలాంటి వాస్తు చిట్కాలను మనం పాటించాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మొక్కలు, పువ్వులు ఇంటి అదృష్టాన్ని, సానుకూల శక్తిని ఇస్తాయి అని నమ్ముతారు. ఇక అలా ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలంటే ఇంట్లో వెదురు, తామర, మల్లె, తులసి వంటి మొక్కలను పెంచుకోవచ్చు. ఆకుపచ్చ లేదా నీలం పూల కుండి ని ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఉంచవచ్చు. అలాగే పసుపు కలిగిన పూల మొక్క ను నైరుతి మూల పెంచడం వల్ల వాస్తు కారణంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది.

this is what you have to do to grow financially
this is what you have to do to grow financially

అద్దం అనేది మంచి వ్యాపార అభివృద్ధి కోసం పెట్టుకోవాలి. ఈ అద్దాన్ని ఉత్తరం లేదా పడమర దిశలో పెట్టుకోవడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి.ఇంట్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టి, ధూపం వెలిగించాలి. ప్రతికూలతను దృష్టిని తొలగిస్తుంది. ఆగ్నేయ మూలలో పెట్టడం వల్ల మీరు చేపట్టిన పనిలో విజయం సొంతమవుతుంది.ఇక అక్వేరియం లాంటివి ఇంట్లో తీసుకొచ్చినట్లయితే ఇంటికి ఈశాన్య దిశలో ఉంచితే శుభప్రదం జరుగుతుంది. సానుకూల శక్తి , సంపద , శ్రేయస్సు కలుగుతాయిఉప్పు కళ్లను కూడా ఇంటి మూలల్లో వుంచడం వల్ల ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.