Oneplus Smart TV : వన్ ప్లస్ 55 అంగుళాల స్మార్ట్ టీవీ పై ఊహించని డిస్కౌంట్.. థియేటర్ అనుభూతి కన్ఫామ్..!

Oneplus Smart TV : ప్రస్తుతం ఎక్కడ చూసిన స్మార్ట్ టీవీల హవా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్మార్ట్ టీవీల పై భారీ డిస్కౌంట్ లు ప్రకటిస్తూ మరింతగా కష్టమర్లకు చేరువవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మీరు కూడా ఒక స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా డిస్కౌంట్లను పరిశీలించాల్సి ఉంటుంది. డిస్కౌంట్ ను బట్టి స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయడం వల్ల మీకు ధర కారణంగా సంతృప్తి లభిస్తే.. టీవీ కారణంగా థియేటర్ అనుభూతి కలుగుతుంది. ఈ క్రమంలోని 55 అంగుళాల భారీ డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీ పై ఊహించని విధంగా డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.

వన్ ప్లస్ యు వన్ ఎస్ సిరీస్ లో భాగంగా 55 అంగుళాల స్మార్ట్ టీవీ పై ఏకంగా రూ.17 వేల వరకు డిస్కౌంట్ లభిస్తూ ఉండడం గమనార్హం ముఖ్యంగా ఈ టీవీ అసలు ధర రూ.59,999 కాగా ఈటీవీ పై రూ. 17వేల డిస్కౌంట్ తో కేవలం రూ.42,999 కే కొనుగోలు చేయవచ్చు . అంతేకాదు అదనంగా రూ.2000 తగ్గింపు కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ అదనపు తగ్గింపు రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుందని కూడా వన్ ప్లస్ ప్రకటించింది. మరి ఈటీవీ ఫీచర్స్ విషయానికి వస్తే..

Get huge discounts on Oneplus Smart TV
Get huge discounts on Oneplus Smart TV

4కె డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ టీవీలో గామా ఇంజన్, ఎం ఈ ఎం సి, డైనమిక్ కాంట్రస్ట్ , కలర్ స్పేస్ మ్యాపింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ టీవీలో 2GB ర్యామ్, 16 GB స్టోరేజ్ మెమరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ టీవీలో 30 W డాల్బీ ఆడియో స్పీకర్లు కూడా అమర్చబడి ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ గూగుల్ అసిస్టెంట్, క్రోమ్ కాస్ట్, ఆండ్రాయిడ్ 10 OS, స్పోటి ఫై, గూగుల్ ప్లే స్టోర్ తో పాటు రెండు హెచ్డిఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు కూడా ఉన్నాయి.