Pooja Hegde: ఒకప్పుడు చిన్న హీరోలతో కలిసి పని చేసిన పూజా హెగ్డే.. అరవింద సమేత తర్వాత పెద్ద హీరోలతో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత పూజా పట్టుకున్నదల్లా బంగారం అయింది. కొన్ని రోజులు ఈ అమ్మడి హవా సాగింది. ఇక ఇటీవల పూజా నటించిన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఇలా వరుస ఫ్లాపులు కావడంతో ఈ అమ్మడి కెరీర ప్రశ్నార్ధకంగా మారింది. టాలీవుడ్ సినీ మేకర్స్ ఈ అమ్మడిని పట్టించుకోవడమే మానేశారనే టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో త్రివిక్రమ్ ఆఫర్ ఇచ్చి అమ్మడిని ఆదుకున్నాడు.మహేష్ బాబు సరసన పూజా హెగ్డే ను సెలెక్ట్ చేసాడు.
అయితే ఈ సినిమా షూట్ మాత్రం లేటవుతూ వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పూజాకి గట్టి కాంపిటీషన్ ఉంది. మరోవైపు పూజా తనకు వస్తున్న ఫ్లాప్స్ చూడకుండా భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తుందనే టాక్ ఉంది.. పూరి జగన్నాథ్ సినిమాకి పూజా రు. 5 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందని, వరుస అవకాశాలతో ఆమె యాట్యిట్యూడ్ మరింత చూపిస్తుందనే చర్చ నడుస్తుంది. అయితే ఇటీవల పూజా కొంత ఎక్కువ ఓవర్ చేయడంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెపై దృష్టి పెట్టడమే మానేశారట. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతుంది. అక్కడ అమితాబ్ బచ్చన్‌తో చేసిన యాడ్ బాగా పాపులర్ కాగా, సినిమా కెరీర్ మాత్రం కలిసి రావడం లేదు.
Pooja Hegde : కష్టకాలం..!
ప్రస్తుతానికి పూజా నుండి ఇప్పట్లో సినిమాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. చేతిలో నాలుగు సినిమాలున్నా కూడా అవేవి సక్సెస్ సాధిస్తాయో లేదో చెప్పడం కష్టం. రెమ్యునరేషన్ భారీగా పెంచేయడం, తనతో సపోర్టింగ్ స్టాఫ్‌ని ఎక్కువ మందని తెచ్చుకొని నిర్మాతలను ఇబ్బంది పెట్టడంతో టాలీవుడ్ మేకర్స్ ఆమెని చాలా లైట్ తీసుకున్నారట. ఈ అమ్మడు హిందీలో సల్మాన్ సరసన నటిస్తుండగా, ఈ సినిమా ఎంతవరకూ కలిసి వస్తుందో ? ఈసారి తేడా జరిగితే మాత్రం హిందీలో దాదాపు గేట్లు మూసి వేస్తారనే చెప్పాలి.