Karthika Deepam 20 Oct Episode : పోలీసుల దగ్గర మోనితను అడ్డంగా బుక్ చేసిన కార్తీక్..! దుర్గ సేఫ్.. దీప హ్యాపీ..!

Karthika Deepam 20 Oct Episode : మోనిత నువ్వే కదా శివతో ఆ దుర్గ వచ్చినప్పటి నుంచి నన్ను అలా బయటకు వెళ్ళమని పంపిస్తున్నావు కదా.. అందుకే నేనే దీప వాళ్ళ ఇంటికి వస్తున్న అని కార్తీక్ అంటాడు.. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అని మోనిత అంటుంది.. డాక్టర్ బాబు అనింది కూడా నిజమే కదా మోనిత.. మొన్న ఎప్పుడో దుర్గా వచ్చినప్పుడు శివను పంపించి డాక్టర్ బాబు ని రెండు గంటలు బయట తిప్పి తీసుకురా అని చెప్పావు కదా అని దీప అంటుంది.. ఏ భర్త అయినా భార్య అలా చెబితే తట్టుకోగలడా..

అయినా డాక్టర్ బాబు మళ్లీ ఇంకోసారి నువ్వు ఎక్కడ అలా చెప్పిస్తావో అని ముందుగానే వచ్చేసారు అని దీప అనగానే.. మోనిత దీప ను నోర్ముయ్ అని పెద్దగా అంటుంది.. కార్తీక్ రా ఇంటికి వెళ్దాం అని మోనిత రిక్వెస్ట్ చేస్తుంది.. వంట నేనే చేసాము మోనిత తినకుండా వస్తే అసలు బాగోదు.. రా కూర్చో నువ్వు కూడా తిందువు గాని అని కార్తీక్ అంటాడు.. ఛ అని విసుక్కుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మోనిత..

karthika-deepam-20-oct today full episode
karthika-deepam-20-oct today full episode

కార్తీక్ మనసులో నామీద అనుమానం రావడానికి ఆ దుర్గ గాడే కారణం.. అర్జెంటుగా ముందు వాడి సంగతి చూడాలి.. ఆ తర్వాత వీళ్ళిద్దరి సంగతి ఏంటో చూస్తాను అని అనుకుంటుంది మోనిత.. అంతలో దుర్గా ఎవరితోనో ఫోన్లో సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు.. ఆ తరువాత మోనిత దుర్గ దగ్గరకు వెళ్లి నీ సంగతి ఏంటో చూస్తాను రా..? రేపటికల్లా నువ్వెక్కడ దుకాణం సద్దేస్తావు.. ఇక ఈ ఫీల్డ్ లో నేను కార్తీక్ తప్ప ఇంక ఎవ్వరూ ఉండరు.. నీ పని అయిపోయింది.. రేపటితో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఖాయమని మోనిత స్ట్రాంగ్ గా దుర్గకి వార్నింగ్ ఇస్తుంది.. దుర్గ అదే విషయాన్ని వెళ్లి దీపకు చెబుతాడు.. దుర్గ అది ఏం చేయదు.. దుర్గ నువ్వు ఇచ్చే టార్చర్ కే మోనిత తట్టుకోలేక పోతుంది అని దీప అంటుంది.. కాదు దీపమ్మ ఈసారి మోనిత ఏదో గట్టిగా ప్లాన్ చేస్తోంది.. తనను చూస్తుంటే నాకు అర్థం అవుతుంది కదా అని దుర్గా అంటాడు..

వెంటనే ఈ విషయాన్ని కార్తీక్ తో చెప్పాలి అని డాక్టర్ బాబు డాక్టర్ బాబు అంటూ కార్తీక్ దగ్గరకు వస్తుంది.. మోనిత దుర్గని ఏదో చేయడానికి ప్లాన్ చేసింది డాక్టర్ బాబు అని చెబుతుంది.. అంతలో మోనిత పోలీసులను తీసుకుని వాళ్ళ ఇంటికి వస్తుంది.. రండి ఇన్స్పెక్టర్ గారు అరెస్టు చేయాల్సింది వాడినే అని దుర్గ వైపు చూపిస్తుంది.. వెంటనే కానిస్టేబుల్స్ వెళ్లి దుర్గను గట్టిగా పట్టుకుంటారు.. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అని దుర్గా పోలీసులను నిలదీస్తాడు.. అప్పుడే దుర్గా ఎవరితోనూ ఆ బ్యాంకు వైపుకు వెళ్ళకండి పోలీసులతో జాగ్రత్తగా ఉండాలి అని.. ఫోన్ లో మాట్లాడిన మాటలను మోనిత తన ఫోన్లో వీడియో తీస్తుంది.. అదే వీడియోను పోలీసులు తీసి చూపిస్తారు.. అప్పుడే కార్తీక్ మీరు అనవసరంగా దుర్గని అరెస్టు చేస్తున్నారు అని అంటాడు..

మోనిత కి దుర్గా చాలా బెస్ట్ ఫ్రెండ్ .. మోనిత ఆ విషయం నువ్వే కదా నాతో చెప్పవు కదా.. ఇప్పుడు పోలీసులకు దుర్గా ను ఎందుకు అరెస్టు చేయిస్తున్నావు అని అడుగుతాడు.. కార్తిక్ ఏంటి ఇలా రివర్స్ అవుతున్నాడు అని మోనిత మనసులో కార్తీక్ ను అనుమానిస్తుంది.. దుర్గ మా ఇంటికి వచ్చినప్పుడు మోనిత చెప్పిన మాటలు మీరు వినండి.. ఆరోజు నేను కూడా వీడియో తీశాను అని కార్తీక్ తీసిన వీడియోను పోలీసులకు చూపిస్తాడు.. అది చూసిన తర్వాత పోలీసులు ఏంటి మేడం ఇలా చేశారు అని అంటారు..

మా మోనిత ను మీరు తప్పుగా అనుకోకండి.. తనకు ఈ మధ్య జరిగినది ఏమీ గుర్తుండడం లేదు .. తను ఒక మెమరీ లాస్ పేషెంట్ అని చెబుతాడు.. ఈ విషయంలో ఇద్దరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు.. మరి ఈ దుర్గా ఏంటి అని పోలీసులు అడుగుతారు.. కేసు అది ఇది అని మాట్లాడుతున్నాడు అని కార్తీక్ ను అడుగుతాడు.. ఓ అదా నేను చెప్తాను ఇన్స్పెక్టర్ గారు అంటూ.. దుర్గా మా కంపెనీకి ఒకడు సరుకు వేస్తామని చెప్పి.. ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశాడు.. అందుకే బ్యాంకులో తీసిన డిడి గురించి మాట్లాడుతున్నాను.. అతనితో పోలీసులు కంప్లైంట్ ఇస్తానని చెబుతున్నాను.. అదే వీడియోలో ఉంది అని దుర్గా చెబుతాడు..

ఇప్పుడు మీరు దుర్గని అరెస్టు చేయాలంటే మా మోనిత ను కూడా అరెస్టు చేయాలి కదా అని కార్తీక్ అంటాడు.. కానీ తను గతం మర్చిపోయింది అందుకే.. ఒక్కోసారి తను ఏం మాట్లాడుతుందో తనకి తెలియడం లేదు.. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అని కార్తీక్ అంటాడు .. కార్తీక్ అన్న మాటలను విని మోనిత షాక్ అవుతుంది. నేను కార్తీక్ గతం మర్చిపోయాడు అని అంటుంటే.. ఇప్పుడు నన్నే గతం మర్చిపోయాను అని కార్తీక్ పోలీసులు ముందు చెబుతున్నాడు.. అయితే గతంలో మోనిత ఏమైనా క్రిమినలా అని అడుగుతాడు.. అలాంటిది ఏమీ లేదు అని అంటాడు కార్తీక్.. అంతలో మా దీపను ఈమధ్య ఎవరో ఎటాక్ చేశారు.. మీరే తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి అని కార్తీక్ అంటాడు.. వాళ్ళు ఎవరో తెలిస్తే పేరు చెప్పండి.. వాళ్ల మీద ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాము అని పోలీసులు అంటారు.. మోనిత అని కార్తీక్ చెప్పేస్తాడేమోనని అంతా అనుకుంటారు కానీ.. ప్రస్తుతానికి సస్పెన్స్.. మరి రేపైనా మోనిత పేరు కార్తీక్ చెబుతాడా లేదా అనేది చూడాలి..