Cashew Nuts Dish : ఇంట్లో ఏమి లేవు జీడిపప్పు మాత్రమే ఉంది. అనుకున్నపుడు ఈ వంటకం చేయండి.. టేస్టీతో రా రాజు!

Cashew Nuts Dish :చపాతీ, రోటీ, నాన్, పరోటాల్లోకి చాలా రకాల కర్రీస్ చేస్తుంటారు . అలా చాలా రకాల కర్రీస్ తిని తిని బోరు కొట్టిన వాళ్ళు ఈ కర్రీను ఒకసారి ట్రై చేసి చూడండి. అదే కాజు మష్రూమ్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కర్రీని ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. ఈ కర్రీ రోటీ, చపాతీ, పరోటాల్లోకి బాగా సెట్ అవుతుంది. అంతేకాక ఈ కర్రీ బగారా రైస్ కి జీరా రైస్ కి కూడా బాగుంటుంది.

There is nothing in the house, only cashew nuts. Make this dish
There is nothing in the house, only cashew nuts. Make this dish

టిప్స్
1. ఈ కర్రీకి వాడే జీడిపప్పు పేస్టు కచ్చాపచ్చాగా కాకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అవ్వాలంటే జీడిపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. అప్పుడే కర్రీకి రుచి వస్తుంది. 2. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. తరువాత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే కర్రీకి గ్రేవీ బాగా వస్తుంది.
3. జీడిపప్పు, మష్రూమ్ ని ఈ రెండింటిని కలిపి వేపుకోవాలి. ఇలా చేస్తేనే మష్రూమ్ మెత్తగా అవ్వదు. 4. మష్రూమ్స్ ని ఎక్కువగా వేపితే తినడానికి రుచిగా ఉండదు.
5. మష్రూమ్ని రెండు ముక్కలుగా మాత్రమే
కోసుకోవాలి.
కావలసిన పదార్థాలు: గ్రేవీ కోసం ఎర్రని టొమాటోలు – 3, అల్లం ముక్క -1 ఇంచ్, పచ్చిమిర్చి – 3, వెల్లుల్లి-4, యాలకులు – 2, లవంగాలు – 3, ఎండు మిర్చి – 2 , మిరియాలు – 1/2 స్పూన్, మీగడ పెరుగు – 1/4 కప్పు, మెత్తగా రుబ్బుకోవడానికి తగినన్ని నీళ్ళు
కూర కోసం
నూనె- 1/2 కప్పు, జీడిపప్పు-3/4 కప్పు, మష్రూమ్స్-150grms, సన్నని ఉల్లిపాయ తరుగు-1,
గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి – 1/2 స్పూన్, కాశ్మీర్ కారం – 2 స్పూన్స్, ఉప్పు- తగినంత, 350 ml నీళ్లు నెయ్యి – 1 స్పూన్, కొత్తిమీర- 2 స్పూన్, నిమ్మరసం1/2

తయారు చేసే విధానం
1. గ్రేవీ కోసం ఉంచిన పదార్థాలన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్టులాగా రుబ్బుకోవాలి.2. ఒక కడాయి తీసుకొని దానిలో
నూనెను వేసి జీడిపప్పును సగం వరకు వేపుకోవాలి.
3. సగం వరకు వేయించిన జీడిపప్పులో మష్రూమ్స్ ని వేసి లైట్ గోల్డెన్ రంగు వచ్చేదాకా వేపుకోవాలి. 4. జీడిపప్పుని, మష్రూమ్స్ ని తీసి పక్కన పెట్టుకోవాలి 5. అదే కడాయిలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలను
వేసి లైట్ గోల్డెన్ రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
6. ఇలా వేయించిన దానిలో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా
వేయించాలి. 7. ఈ మసాలాలు వేసిన తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టును వేసి 350 ml నీళ్ళని వేసి గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలేదాకా ఉంచాలి.8.ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి.9. నూనె పైకి తేలాక జీడిపప్పు, మష్రూమ్సనివేసి 3-4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి..10. లాస్ట్లో నెయ్యి, కొత్తిమీరని వేసి నిమిషం వరకు ఉడకనివ్వాలి. 11. ఆఖరున 1/2 చెక్క నిమ్మ రసాన్ని వేసుకోవాలి.