Bigg Boss 6 Telugu : సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న వారిలో సిరి హనుమంత్ కూడా ఒకరు. షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఈమె ఎక్కువగా షార్ట్ ఫిలిమ్స్ , యూట్యూబ్ వీడియోస్ చేసి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు ఈమధ్య కాలంలో అక్కడక్కడ సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత సిరికి మరి ఎంతోమంది అభిమానులుగా మారారు. ముఖ్యంగా హౌస్ లో ఈమె చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అంతే కాదు షణ్ముఖ్ తో స్నేహం అంటూనే లవ్ ట్రాక్ కూడా నడిపిందని వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
సరిగ్గా అప్పుడే సిరి హనుమంతు బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా వెలుగులోకి వచ్చారు. శ్రీహాన్ కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు. కాకపోతే ఈయనకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. కానీ సిరి బాయ్ ఫ్రెండ్ గా మాత్రం పూర్తిస్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్న శ్రీ హాన్ ఇప్పుడు బిగ్ బాస్ ఆరవ సీజన్లోకి అడుగుపెట్టాడు. ఇక అక్కడ తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అనుభవించడమే కాకుండా బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో కూడా ఏమాత్రం గొడవకు పోకుండా సామరస్యంగా వారితో స్నేహం చేస్తున్నారని చెప్పాలి. ఇక బిగ్ బాస్ ఇచ్చే ఏ టాస్క్ అయినా సరే చాలా సునాయాసంగా చేయగలుగుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో శ్రీహన్ ఒంటరిగా తన గర్ల్ ఫ్రెండ్ సిరి హనుమంత్ ను తలుచుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటే..
ఆమె మాత్రం బయట ఒక అతనితో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు వీడియో వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు జస్వంత్.. మోడల్ జెస్సీ గా గుర్తింపు తెచ్చుకొని బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు జెస్సీ.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి బయట ఉన్నట్లు అందుకు సంబంధించిన వీడియోలు కూడా జెస్సీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో సిరి కూడా తన బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ను మిస్ అవుతున్నట్టు తెలిపింది. ఏది ఏమైనా శ్రీహాన్ కోసం సిరి.. సిరి కోసం శ్రీహన్ బాగా పరితపిస్తున్నట్లు తెలుస్తోంది.
.