Prabhas : ప్రభాస్ కోసం తన భర్త లేకపోయినా.. కృష్ణంరాజు భార్య అతిపెద్ద నిర్ణయం.. దేవత తల్లీ నువ్వు.!

Prabhas ; ఏ ఇంటికైనా ఆ ఇంటి పెద్ద దిక్కు లేకపోతే ఆ వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.. ఒక విషయంలో కాకపోయినా ఒక విషయంలో అయినా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ ఆ లోటును ఎవ్వరూ భర్తీ చేయలేరు.. కానీ ప్రభాస్ విషయంలో అలా కాదు.. తనకి నేనున్నా ధైర్యాన్ని ఇస్తుంది వాళ్ళ పెద్దమ్మ.. ఈ విషయంలో మాత్రం ప్రభాస్ అదృష్టవంతుడు అంటున్నారు ఫ్యాన్స్.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.!? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రామాయణ ఇతిహాస కావ్యం ఆదిపురుష్.. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలవగా విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకోండి.. ఈ సినిమా టీజర్ పై మీమ్స్, ట్రోల్స్ సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి..

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ను యూట్యూబ్ నుంచి వెంటనే తొలగించాలని, అలాగే ఈ సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. ఆ పిటిషన్ పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ప్రభాస్, చిత్ర యూనిట్ కు నోటీసులు పంపించారు.. మళ్ళీ ఇంకొక పిటిషన్ కూడా ఉత్తరాఖండ్లో దాఖలు అయినట్టు సమాచారం.. ఇలా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కి అడుగడుగునా కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి.. అదే రెబల్ స్టార్ కృష్ణంరాజు బ్రతికి ఉండి ఉంటే ప్రభాస్ కు ఇంత కష్టం వచ్చి ఉండేది కాదని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే.. ప్రభాస్ వాళ్ళ పెద్దనాన్న కృష్ణంరాజు బ్రతికి ఉండి ఉంటే..

Krishnam Raju wife is biggest decision for Prabhas
Krishnam Raju wife is biggest decision for Prabhas

ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ ఇష్యూ పైన ఆయనే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రభాస్ కి అండగా నిలిచేవాడు.. అలాగే ప్రజలకు కూడా ఈ సినిమా డైరెక్టర్ ఎలా తీస్తున్నారో వివరించి చెప్పేవారు.. ఇప్పుడు కృష్ణంరాజు లేని లోటును ఆయన భార్య శ్యామల దేవి భర్తీ చేయనున్నట్టు సమాచారం.. కృష్ణంరాజు బాధ్యతను ఆవిడ తీసుకుందామని అనుకుంటున్నారు.. ప్రభాస్ కి ఇన్నాళ్లు సినిమాలకు సంబంధించి ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా కూడా.. ప్రభాస్ కోసం కృష్ణంరాజు ఓ లాయర్ ని తనే ప్రత్యేకంగా అరేంజ్ చేసేవాళ్ళు.. ఇప్పుడు అదే లాయర్ తో నేరుగా శ్యామలాదేవి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.. ఈ విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు నువ్వు నిజంగా పెద్దమ్మ అవి కాదు.. దేవతవి తల్లి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..